శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్’ సిస్టమ్
Send us your feedback to audioarticles@vaarta.com
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ ఎయిర్‌పోర్టులో లగేజ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అటు సిబ్బంది.. ఇటు ప్రయాణీకులు.. వాటికి సమయం ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. దేశీయంగా ప్రయాణించే వారికి ఇదొక తలనొప్పిగా పరిణమిస్తుంటుంది. చిన్నపాటి లగేజ్ కోసం కూడా ఎక్కువ సేపు లైన్ లలో నిల్చోవలసి ఉంటుంది.
దీనికి చెక్ పెట్టేందుకు ఎయిర్ పోర్టు అధికారులు కొత్త సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్(ఎస్‌బీడీ) సిస్టమ్ అంటారు. జనవరి 26 నుంచి ఈ పద్ధతి వినియోగంలోకి వచ్చింది. దీని ప్రకారం కియోస్కీ మెషిన్ దగ్గర మొదట ప్రయాణీకులు తమ వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని నుంచి ట్యాగ్‌తో పాటు బోర్డింగ్ కార్డును పొందవచ్చు. ట్యాగ్‌ను లగేజ్‌కి జతచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బోర్డింగ్ కార్డును సెక్యురిటీ అవసరాల కోసం స్కాన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని తీసుకెళ్లి ‘సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్’లలో పెడితే సరిపోతుంది. దీనివల్ల ప్రయాణీకులకు పెద్ద ఎత్తున సమయం ఆదా అవుతుంది. క్యూలో నిల్చుండే అవసరం కూడా ఉండదు. కొత్త వ్యవస్థ పట్ల ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఈ ఏడాది ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను, అలాగే పేపర్ లెస్ పద్ధతిని తీసుకొస్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout