శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్’ సిస్టమ్

  • IndiaGlitz, [Thursday,January 30 2020]

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు సాంకేతికతను విరివిగా ఉపయోగిస్తున్నారు. నిత్యం వందలాది మంది ప్రయాణించే ఈ ఎయిర్‌పోర్టులో లగేజ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అటు సిబ్బంది.. ఇటు ప్రయాణీకులు.. వాటికి సమయం ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. దేశీయంగా ప్రయాణించే వారికి ఇదొక తలనొప్పిగా పరిణమిస్తుంటుంది. చిన్నపాటి లగేజ్ కోసం కూడా ఎక్కువ సేపు లైన్ లలో నిల్చోవలసి ఉంటుంది.

దీనికి చెక్ పెట్టేందుకు ఎయిర్ పోర్టు అధికారులు కొత్త సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్ని సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్(ఎస్‌బీడీ) సిస్టమ్‌ అంటారు. జనవరి 26 నుంచి ఈ పద్ధతి వినియోగంలోకి వచ్చింది. దీని ప్రకారం కియోస్కీ మెషిన్ దగ్గర మొదట ప్రయాణీకులు తమ వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని నుంచి ట్యాగ్‌తో పాటు బోర్డింగ్ కార్డును పొందవచ్చు. ట్యాగ్‌ను లగేజ్‌కి జతచేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత బోర్డింగ్ కార్డును సెక్యురిటీ అవసరాల కోసం స్కాన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని తీసుకెళ్లి ‘సెల్ఫ్ బ్యాగ్ డ్రాప్’లలో పెడితే సరిపోతుంది. దీనివల్ల ప్రయాణీకులకు పెద్ద ఎత్తున సమయం ఆదా అవుతుంది. క్యూలో నిల్చుండే అవసరం కూడా ఉండదు. కొత్త వ్యవస్థ పట్ల ప్రయాణీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఈ ఏడాది ఫేస్ రికగ్నైజేషన్ వ్యవస్థను, అలాగే పేపర్ లెస్ పద్ధతిని తీసుకొస్తామని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

More News

RRRలో ఆలియా భట్ కోసం ప్ర‌త్యేక గీతం

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’. డి.వి.వి.దాన‌య్య నిర్మాత‌.

కాళోజీ నారాయణ రావు బయోపిక్ షూటింగ్ ప్రారంభం

"ప్రజాకవి-కాళోజీ" సినిమాను "జైనీ క్రియేషన్స్" బ్యానర్ పై శ్రీమతి విజయలక్ష్మీ జైనీ నిర్మిస్తున్నారు.

'ఆనంద భైరవి' యాభై శాతం పూర్తి...

M.V.V. సత్యనారాయణ (వైజాగ్ ఎంపీ) సమర్పణలో అంజలి, లక్ష్మీరాయ్, అధిత్ అరుణ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం "ఆనంద భైరవి"

మహేష్ బాబు సినిమాలో మరో క్రేజీ స్టార్?

రీసెంట్ గా 'సరిలేరు నీకెవ్వరు'తో సందడి చేసిన మహేశ్ బాబు... తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే.

దుబాయ్ వెళుతున్న బాల‌కృష్ణ‌..ఎందుకు?

సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబోలో ఓ సినిమా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.