శేఖర్ మూవీస్ ఫస్ట్ లుక్ , టీజర్ లాంచ్
Friday, July 28, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఆది పినిశెట్టిని దర్శకుడి గా పరిచయం చేస్తూ శేఖర్ మూవీస్ పతాకంపై ఎస్. చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్ర ఫస్ట్ లుక్ , టీజర్ కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రవిచంద్రన్ , హీరోయిన్ సుమయ , దర్శక నిర్మాతలు ఆది పినిశెట్టి , చంద్రశేఖర్ లతో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఇదే రోజు నిర్మాత చంద్రశేఖర్ పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేయించి యూనిట్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ దర్శకులు ఆది పినిశెట్టి చెప్పిన కథ నచ్చడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒప్పుకున్నానని , అంత బాగా నచ్చిందని .....ఆ వెంటనే సినిమా సెట్స్ మీదకు వెళ్లిందని మిగతా విషయాలన్నీ శతదినోత్సవ వేడుకల్లో మాట్లాడతానని అన్నాడు.
హీరోయిన్ సుమయ మాట్లాడుతూ నాకు కూడా ఈ సినిమా కథ బాగా నచ్చిందని అందుకే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశానని, ఈ సినిమా నాకు ఒక మంచి ఎక్స్ పీరియన్స్ అని తెలిపింది.
దర్శకులు ఆది పినిశెట్టి మాట్లాడుతూ కథ చెప్పిన మూడు గంటల్లోనే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు చంద్రశేఖర్ గారు. నాకు తమిళ దర్శకులు బాల అంటే చాలా ఇష్టం , ఆయన లాంటి విభిన్నమైన సినిమాలు చేయాలనేది నా ఆశ . అందుకే ఈ సినిమా చేసాను. తెలుగులో బిచ్చగాడు సినిమా సంచలన విజయం సాధించింది, అదే స్థాయిలో మా సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రవిచంద్రన్ తో పాటు సంగీత దర్శకులు గౌతమ్, సాంబ , మల్లేష్ , నంద కృష్ణ , రమేష్, రాన్ రవి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments