మీరు చేసినదాంతో పోల్చితే నేను చేసిందేమీ లేదు: శేఖర్ కమ్ముల
Send us your feedback to audioarticles@vaarta.com
సెన్సిబుల్ సినిమాలను తెరకెక్కించే దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన తెరకెక్కించిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైప్ ఈజ్ బ్యూటీఫుల్ ఇలాంటి సినిమాలే ఆయన స్టైల్ ఏంటో చెబుతాయి. సినిమాల్లో ఓ పంథాను అనుసరించే దర్శకుడు శేఖర్ సామాజిక సేవలోనూ అందరి కంటే వైవిధ్యమైన పంథాలో ముందుకెళ్తున్నారు. కరోనా వల్ల ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. కరోనాపై ప్రభుత్వాలు చేసే పోరులు డాక్టర్స్, పోలీసులు, ఇతర ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ముందు వరుసలో ఉండి పోరాడుతున్నారు.
ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సేవలను అందరూ ప్రత్యేకంగా కొనియాడుతున్నారు. వీరి కోసం డైరెక్టర్ శేఖర్ కమ్ముల రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య ప్రాంతాలైన హైదరాబాద్, కర్నూలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం బాదంపాలు, మజ్జిగను సరఫరా చేస్తున్నారు. శేఖర్ కమ్ముల అందిస్తున్న ఈ సాయానికి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు ఆయనకు థాంక్స్ చెబుతూ ప్లకార్డులు పట్టుకున్నారు. ఈ ఫొటోను చూసిన శేఖర్‌కమ్ముల ట్విట్టర్ ద్వారా తన స్పందనను తెలియజేశారు. ‘‘మీ స్పందన వెలకట్టలేనిది. అదే నాకు పెద్ద బహుమతి. నా పని మిమ్మల్ని కదిలించినందుకు ఆనందంగా ఉంది. అయితే మీరు చేస్తున్న దానితో పోల్చితే నేను చేస్తున్నది చాలా తక్కువే’’ అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout