అదే రిపీట్ చేస్తున్న శేఖర్ కమ్ముల
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినీ ఇండస్ట్రీలో శేఖర్ కమ్ములకు సెన్సిబుల్ డైరెక్టర్ అనే పేరుంది. అంతే కాదు.. త్వరత్వరగా సినిమాలు చేసేయాలని కాకుండా చాలా కూల్‌గా సినిమాలు చేసుకుంటారు. అనుకున్న ఔట్పుట్ రాకపోతే రీ షూట్స్ చేస్తుంటాడు. `ఫిదా` వంటి సూపర్‌డూపర్ హిట్ తర్వాత ఈ డైరెక్టర్ ఇప్పటి వరకు తన తదుపరి సినిమాను సిద్ధం చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవితో లవ్‌స్టోరి సినిమాను తెరకెక్కిస్తున్నారు. కోవిడ్ లేకపోయుంటే సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది. కానీ షూటింగ్స్ ఆగిన తర్వాత ఇప్పుడు మళ్లీ రీస్టార్ట్ అవుతున్నాయి.
ఈ క్రమంలో శేఖర్ కమ్ముల తన ఔట్పుట్ చూసుకున్న తర్వాత హ్యాపీగా ఫీల్ కాలేదట. దీంతో రీషూట్స్కు సిద్ధమయ్యాడట. చైతన్య,సాయిపల్లవి కూడా రీషూట్స్కు డేట్స్ అడ్జస్ట్ చేశారట. పరిస్థితి చూసిన వారు ఫిదా సమయంలో జరిగినదే ఇప్పుడు రిపీట్ అవుతుందని అంటున్నారు. ఫిదా సమయంలో రీషూట్స్ చేసిన శేఖర్, ఇప్పుడు లవ్‌స్టోరి విషయంలోనూ అదే చేస్తున్నాడంటున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ రానుందని సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments