శేఖర్ కమ్ముల హీరోల మధ్య పోటీ
Send us your feedback to audioarticles@vaarta.com
ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌లకి పెట్టింది పేరు.. దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ జోనర్‌లో ఆయన రూపొందించిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, ఫిదా మంచి విజయం సాధించాయి. అంతేకాకుండా.. ఆయా చిత్రాల్లో నటించిన హీరోలకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ హీరోలలో నిఖిల్, వరుణ్ తేజ్ కూడా ఉంటారు.
హ్యాపీ డేస్‌తో నిఖిల్‌కి మంచి పేరు వస్తే.. ఫిదాతో వరుణ్‌కి మంచి గుర్తింపు వచ్చింది. వీరిద్దరికి తొలి సక్సెస్ వచ్చింది శేఖర్ కమ్ముల సినిమాలతోనే. అలాంటి ఈ హీరోల సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే.. కన్నడంలో విజయం సాధించిన కిర్రిక్ పార్టీ ఆధారంగా రూపొందిన నిఖిల్ తాజా చిత్రం కిర్రక్ పార్టీ.
ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిగ్గా అదే రోజున వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం తొలి ప్రేమ రానుంది. విశేషమేమిటంటే.. ఈ రెండు చిత్రాలు కూడా కొత్త దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలు కావడం. కిర్రక్ పార్టీని షరన్ కొప్పిశెట్టి తెరకెక్కిస్తుంటే.. తొలిప్రేమని వెంకీ అట్లూరి రూపొందిస్తున్నాడు. మరి.. ఈ రెండు చిత్రాల్లో ఏ సినిమాకి విజయం దక్కుతుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com