మరో సాయానికి శ్రీకారం చుట్టిన శేఖర్ కమ్ముల
Send us your feedback to audioarticles@vaarta.com
ఆపదలో ఉన్నప్పుడు దొరికే సాయం చిన్నదా? పెద్దదా? అని చూసుకోకూడదు. ఎందుకంటే ప్రార్థించే పెదాల కన్నా.. సాయం చేసే చేతులే మిన్న అని మనం వినే ఉంటాం. అయితే కొందరు తమ సాయాన్ని పదిమందికి చెప్పుకుంటారు. కానీ మరికొందరు ఎంత పెద్ద సాయం చేసినా.. కుడిచేత్తో చేసిన సాయాన్ని ఎడమ చేతికి కూడా చెప్పడానికి ఇష్టపడరు. ఈ రెండు రకాల వ్యక్తుల్లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల రెండో వర్గానికి చెందిన వ్యక్తి. కరోనా వేళ పేదలకు, ఆపన్నులకు శేఖర్ కమ్ముల తన వంతుగా సాయాన్ని అందిస్తున్నారు.
ఇప్పటికే ట్రాన్స్‌జెండర్స్‌కు సాయం అందించిన శేఖర్ కమ్ముల ఆ విషయాన్ని బయటకు పొక్కనీయలేదు. ఇప్పుడు మరో బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టాడు శేఖర్ కమ్ముల. కరోనా వైరస్ బారి నుండి ప్రజలను కాపాడుతున్న వారిలో డాక్టర్స్, వైద్య సిబ్బంది, పోలీసులతో పాటు పారిశుద్ద్య కార్మికులు కూడా ఉన్నారు. వీరిలో 1000 మందికి బాదంపాటు, చల్లటి మజ్జిగను అందించడానికి శేఖర్ కమ్ముల ముందుకొచ్చారు. ఈ సేవలను ఆయన నెలరోజుల పాటు కొనసాగిస్తారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ అధికారులే నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ కమ్ముల, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికారలు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout