మ‌రో సాయానికి శ్రీకారం చుట్టిన శేఖ‌ర్ క‌మ్ముల‌

ఆప‌ద‌లో ఉన్న‌ప్పుడు దొరికే సాయం చిన్న‌దా? పెద్ద‌దా? అని చూసుకోకూడ‌దు. ఎందుకంటే ప్రార్థించే పెదాల క‌న్నా.. సాయం చేసే చేతులే మిన్న అని మ‌నం వినే ఉంటాం. అయితే కొంద‌రు త‌మ సాయాన్ని ప‌దిమందికి చెప్పుకుంటారు. కానీ మ‌రికొంద‌రు ఎంత పెద్ద సాయం చేసినా.. కుడిచేత్తో చేసిన సాయాన్ని ఎడమ చేతికి కూడా చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఈ రెండు ర‌కాల వ్య‌క్తుల్లో డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రెండో వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. క‌రోనా వేళ పేద‌ల‌కు, ఆప‌న్నుల‌కు శేఖ‌ర్ క‌మ్ముల త‌న వంతుగా సాయాన్ని అందిస్తున్నారు.

ఇప్ప‌టికే ట్రాన్స్‌జెండ‌ర్స్‌కు సాయం అందించిన శేఖ‌ర్ క‌మ్ముల ఆ విష‌యాన్ని బ‌య‌ట‌కు పొక్క‌నీయ‌లేదు. ఇప్పుడు మ‌రో బృహ‌త్ కార్యానికి శ్రీకారం చుట్టాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. క‌రోనా వైర‌స్ బారి నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడుతున్న వారిలో డాక్ట‌ర్స్‌, వైద్య సిబ్బంది, పోలీసుల‌తో పాటు పారిశుద్ద్య కార్మికులు కూడా ఉన్నారు. వీరిలో 1000 మందికి బాదంపాటు, చ‌ల్ల‌టి మ‌జ్జిగ‌ను అందించ‌డానికి శేఖ‌ర్ క‌మ్ముల ముందుకొచ్చారు. ఈ సేవ‌ల‌ను ఆయ‌న నెల‌రోజుల పాటు కొన‌సాగిస్తారు. ఈ పంపిణీ కార్య‌క్ర‌మాన్ని జీహెచ్ఎంసీ అధికారులే నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శేఖ‌ర్ క‌మ్ముల, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస‌యాద‌వ్‌తో పాటు జీహెచ్ఎంసీ అధికార‌లు పాల్గొన్నారు.

More News

పాన్ ఇండియా మూవీ '83' పై మేక‌ర్స్ క్లారిటీ

ఇండియన్ క్రికెట్‌ను గ‌తిని మార్చిన ఏడాది 1983. ఈ ఏడాది భార‌త‌దేశం క్రికెట్ ప్ర‌పంచంలో రారాజుగా అవ‌త‌రించింది. క‌పిల్ డేర్ డెవిల్స్ సాధించిన అపూర్వ విజ‌యంతో

స‌స్పెన్స్‌కు తెర దించిన చిరంజీవి

కరోనా ప్ర‌భావంతో సినీ సెల‌బ్రిటీలంతా ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కుటుంబ స‌భ్యుల‌తో స‌ర‌దాగా స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు.

రాబోయే రోజుల్లో కరోనా కేసుల్లేని రాష్ట్రంగా తెలంగాణ : కేసీఆర్

తెలంగాణలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. రోజుకు సింగిల్ డిజిట్‌లోనే మూడు, ఏడు, ఎనిమిది కేసులు మాత్రమే నమోదవుతున్నాయి.

డిజిటల్ మాధ్యమంలోకి తేజ..!

డైరెక్టర్ తేజ త్వరలోనే డిజిటల్ మీడియంలోకి అడుగు పెట్టబోతున్నారు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్రముఖ డిజిట‌ల్ మీడియం సంస్థ అమెజాన్ ప్రైమ్ చ‌ర్చ‌లు జ‌రిపింద‌ట‌.

ముచ్చ‌ట‌గా మూడోసారి ..!

కొన్ని హిట్ పెయిర్(హీరో హీరోయిన్‌)ను చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తిని చూపుతుంటారు. అలాంటి హిట్ పెయిర్స్‌లో నేటి త‌రంలో రాజ్‌త‌రుణ్‌, అవికాగోర్ జోడీ ఒక‌టి.