స్టైల్ మారుస్తున్న శేఖర్ కమ్ముల!!
Send us your feedback to audioarticles@vaarta.com
డైరెక్టర్ శేఖర్ కమ్ముల అంటే మనకు వెంటనే ఫీల్ గుడ్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ఆయన తెరకెక్కించిన ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలను మనం అంత సులభంగా మరచిపోలేం. ఇక ఆయన గత చిత్రం ఫిదా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ, యుఎస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్‌ను సాధించింది. దీని తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో లవ్‌స్టోరీ అనే టైటిల్‌లో ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ లేకుండా ఉండుంటే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చుండేది.
కాగా.. శేఖర్ కమ్ముల ఇప్పుడు రొటీన్‌కు భిన్నంగా వెళ్లాలనుకుంటున్నాడట. లవ్‌స్టోరీ స్థానంలో థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాని ఆయన భావిస్తున్నాడట. గతంలో కహానీ సినిమాను తెలుగులో అనామిక పేరుతో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రైమ్ థ్రిల్లర్ పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో శేఖర్ కమ్ముల మరోసారి థ్రిల్లర్ జోనర్‌లో సక్సెస్ కొట్టే ప్రయత్నాలు చే్స్తున్నాడట. అయితే లవ్‌స్టోరి విడుదలైన తర్వాతే శేఖర్ కమ్ముల ఈ థ్రిల్లర్ సబ్జెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ను పైనలైజ్ చేసుకుంటాడట. మరి ఈ సినిమాను శేఖర్ కొత్త వారితో తెరకెక్కిస్తాడా? లేదా? స‌్టార్స్‌తో ముందుకెళతాడా? అని తెలియాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments