‘సీటీమార్’ టీజర్ రివ్యూ.. అంతా బాగుంది కానీ..
Send us your feedback to audioarticles@vaarta.com
సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘సీటీమార్’. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా నటిస్తున్నారు. గోపిచంద్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో పాటు స్పోర్ట్స్ డ్రామా కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
`మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట` అంటూ గోపించంద్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. స్పోర్ట్స్ డ్రామానే అయినప్పటికీ గోపీచంద్ తరహా యాక్షన్ కూడా ఇందులో ఉన్నట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది. కోచ్‌గా ఆటాడిస్తూనే.. ప్రత్యర్థులను కూడా ఓ ఆట ఆడుకున్నట్టు తెలుస్తోంది. మణిశర్మ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల 2న విడుదలవుతోంది. ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
అంతా బాగుంది కానీ.. అయితే ఒక డైలాగ్ విషయంలో మాత్రం గోపిచంద్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను కాపీ కొట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ సినిమాలో ఎన్టీఆర్.. ‘ఎవడుపడితే వాడు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడతీసి కొడతా.. అలా పిలవాలంటే ఓ అర్హత ఉండాలి లేదంటే నా అభిమాని అయి ఉండాలి’ అంటాడు. ఈ సినిమాలో గోపిచంద్.. ‘నన్ను అలా పిలవాలంటే ఒకటి నా ఇంట్లో వాళ్లు పిలవాలి లేదంటే నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి’ అంటూ చెప్పే డైలాగే సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ డైలాగ్ లాగే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments