'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ కుమారి 21 ఎఫ్` చిత్రంతో హ్యాట్రిక్‌ను సాధించి క్రేజీస్టార్‌గా మారాడు. ఇప్పుడు శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాతలుగా రాజ్ తరుణ్, అర్తనా హీరో హీరోయిన్లుగా రూపొందిస్తున్న చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు. ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. సునీల్ టీజర్‌ను విడుదల చేశారు.
రాజ్ తరుణ్ అంటే నాకు బాగా ఇష్టం. ఈ సినిమా సక్సెస్‌తో తనకు మరిన్ని సిత్రాలు జరగాలని కోరుకుంటున్నాను. నిర్మాతలకు రెండు, మూడు సినిమాల కలెక్షన్స్ ఈ ఒక్క సినిమాకే రావాలి అని సునీల్ అన్నారు. కథపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్. అలాగే రాజ్‌తరుణ్ నాకు ఎప్పుడూ అండగా నిలబడ్డాడు. అందరూ బాగా సపోర్ట్ చేశారని దర్శకుడు శ్రీనివాస్ గవి రెడ్డి తెలిపారు. ఫీల్ గుడ్ లవ్ స్టోరి. సినిమాపై నమ్మకంతో నేను, నా స్నేహితులు కలిసి రెండు ఏరియాలకు డిస్ట్రిబ్యూటర్స్‌గా మారాం. మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అని మారుతి చెప్పారు. నా గురించి, నా బాడీ లాంగ్వేజ్ గురించి బాగా తెలిసిన వ్యక్తి దర్శకుడు.
చాలా మంచి కథను నాకు ఇచ్చారు. గోపిసుందర్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇస్తే, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రీరికార్డింగ్ పూర్తయిపోయింది. ఈ నెల చివర్లో కానీ, వచ్చేనెలలో కానీ సినిమా విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని హీరో రాజ్ తరుణ్ అన్నారు. దర్శకుడు కాన్ఫిడెన్స్ నచ్చి సినిమాను స్టార్ట్ చేశాం. సినిమా స్టార్టింగ్‌లో ఏ కాన్ఫిడెన్స్ అయితే ఉందో, ఇప్పుడు అలాగే ఉన్నాం. సినిమా రషెష్ చూశాం. సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాతో రాజ్ తరుణ్‌కు మరో సక్సెస్ వస్తుందని నిర్మాతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, రాజారవీంద్ర, కె.రోహిత్ రెడ్డి, సినిమాటోగ్రాఫర్ విశ్వ డి.బి తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments