జనవరి 10న రాజ్ తరుణ్ 'సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు' పాటలు

  • IndiaGlitz, [Monday,January 04 2016]

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21ఎఫ్ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను పూర్తిచేసి క్రేజీస్టార్‌గా మారిన యువ కథానాయకుడు రాజ్‌తరుణ్ నటిస్తున్న మరో క్రేజీ చిత్రం సీతమ్మ అందాలు-రామయ్య సిత్రాలు'. షూటింగ్‌ను పూర్తిచేసుకొని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకుడు. శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సున్నితమైన భావోద్వేగాలకు, వినోదానికి పెద్ద పీటవేశాం. రాజ్‌తరుణ్ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంతో అర్తన అనే నూతన హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం కాబోతుంది. నవ్యమైన కథ, కథనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలోని పతాక సన్నివేశాలను భారీఖర్చుతో చిత్రీకరించాం. చిత్రంలో పతాక సన్నివేశాలు హైలైట్‌గా వుంటాయి. తప్పకుండా ఈ చిత్రం రాజ్‌తరుణ్ సెకండ్ హ్యాట్రిక్‌కు శ్రీకారంలా వుంటుంది. జనవరి 10న‌ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియోను విడుదల చేసి, జనవరి 29న‌ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది' అని తెలిపారు.

More News

గ్లోబల్ కాన్సెప్ట్ తో 'సంజీవని'

అనురాగ్, తనూజ, మనోజ్, మోహన్ ప్రధాన పాత్రల్లో రవి వీడే దర్శకత్వంలో నివాస్ క్రియేషన్స్ పతాకంపై జి.నివాస్ నిర్మిస్తున్న చిత్రం 'సంజీవని'. ఈ చిత్రం టీజర్ ను సోమవారం హైదరాబాద్ లో విడుదల చేసారు.

సెన్సార్ పూర్తిచేసుకుని క్లీన్ U సర్టిఫికెట్ తో జనవరి 14న సంక్రాంతి కానుకగా వస్తున్న 'ఎక్స్ ప్రెస్ రాజా'

రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి సూపర్ హిట్స్ తరువాత యంగ్ ఎనర్జిటిక్ స్టార్ శర్వానంద్ హీరోగా,వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బంపర్ హిట్ తరువాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో,

అందుకే..ఆడియోన్స్ ప్రార్థన క్యారెక్టర్ కి కనెక్ట్ అవుతున్నారు. - హీరోయిన్ పల్లక్ లల్వాని

నాగశౌర్య,పల్లక్ లల్వాని జంటగా నటించిన చిత్రం అబ్బాయితో అమ్మాయి.ఈ చిత్రాన్ని రమేష్ వర్మ తెరకెక్కించారు.

న్యూస్ ఛానల్ పై రామ్ ఫైర్...

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన నేను..శైలజ ఇటీవల రిలీజై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ లో మంచి టాక్ తో దూసుకెళుతుంది.

మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకత్వం లో నారా రోహిత్ 'కథలో రాజకుమారి' పాటల రికార్డింగ్!

వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ..ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రామిసింగ్ హీరో నారా రోహిత్ నటించనున్న నూతన చిత్రం 'కథలో రాజకుమారి' చిత్రీకరణ ఈ నెలలో ప్రారంభం కానుంది.