Tamil »
Cinema News »
డైరెక్టర్ ఎన్.శంకర్ చేతుల మీదుగా విడుదలైన 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' ఆడియో
డైరెక్టర్ ఎన్.శంకర్ చేతుల మీదుగా విడుదలైన 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' ఆడియో
Monday, January 11, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రాజ్ తరుణ్, ఆర్తన జంటగా నటించిన చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు. శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎస్ శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు ఆడియో సిడీను డైరెక్టర్ ఎన్.శంకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ...
డైరెక్టర్ ఎన్.శంకర్ మాట్లాడుతూ...తక్కువ సమయంలో సంగీత దర్శకునిగా మంచి పేరు తెచ్చుకున్న గోపీ సుందర్ ఈ సినిమాకి సంగీతం అందించడం ఆనందంగా ఉంది. డైరెక్టర్ గవిరెడ్డి తీర్చిదిద్దే పాత్రలో వెటకారం ఎక్కువ..రాజ్ తరుణ్ లో మమకారం ఎక్కువ. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ సంస్థలో సంస్కారం ఎక్కువ. ఈ ఆడియో వేడుకలో పాల్గోనడం సంతోషంగా ఉంది. ప్రేమకథ కు కామెడీ జోడించి తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అన్నారు.
నిర్మాత ఎస్.శైలేంద్రబాబు మాట్లాడుతూ...ఇప్పటి వరకు కన్నడ సినిమాలు నిర్మించాను. తెలుగులో కూడా సినిమా చేయాలని ప్లాన్ చేసుకుని ఈ సినిమా చేసాం. డైరెక్టర్ శ్రీనివాస్ కథ చెప్పిన దానికన్నాచాలా బాగా తీసాడు. అలాగే గోపీసుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాను అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ మాట్లాడుతూ...ఈ సినిమా నాకు చాలా స్పెషల్. టీమ్ అంతా కష్టపడి చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అన్నారు.
డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి మాట్లాడుతూ...గోపీసుందర్ మ్యూజిక్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఈ సినిమాకి చాలా మంచి ట్యూన్స్ అందించారు. శైలేంద్ర గారు కన్నడలో ఎన్నో సినిమాలు చేసారు. నేను చెప్పిన కథ నచ్చి నన్ను నమ్మి ఈ సినిమా చేసారు. సీత కోసం ఈ రాముడు ఏం చేసాడనేదే ఈ సినిమా. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. సినిమా బాగా రావడానికి సహకరించిన అందరికీ థ్యాంక్స్ అన్నారు.
హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ...గోపి సుందర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి మంచి సినిమాలు అందించాలని తపించే నిర్మాతలు. అలాంటి నిర్మాతలతో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేను బాగా నటించానంటే దానికి కారణం డైరెక్టర్ శ్రీనివాస్. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో మంచి లవ్ స్టోరి, కామెడీ ఉంది. అందరికీ నచ్చుతుంది అన్నారు.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ...సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు మంచి టైటిల్. నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయవుతున్నాడు. ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాతో శ్రీనివాస్ పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను.. గోపీసుందర్ మంచి బాణీలను అందించారు. రాజ్ తరుణ్ వరుసగా విజయాలు సాధిస్తున్నాడు. ఈ సినిమాతో మరో విజయం సాధిస్తాడు అన్నారు.
హీరో ఆది మాట్లాడుతూ...సంవత్సరంన్నరగా శ్రీనివాస్ నాకు తెలుసు. నేను నటిస్తున్న గరం సినిమాకి మాటలు అందించారు. నా సొంత
బ్రదర్లాంటి వాడు. శ్రీను ఎప్పుడు సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. రాజ్ తరుణ్ నేను క్లోజ్ ఫ్రెండ్స్.ఈ సినిమా బిగ్ హిట్ అయి డైరెక్టర్ శ్రీను కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ...రాజ్ తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. హ్యాట్రిక్ తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమా ఇది. ఈ సినిమాతో మరో హ్యాట్రిక్ స్టార్ట్ కావాలి అన్నారు.
డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ మాట్లాడుతూ..ఈ సినిమా నా సొంత సినిమా లాంటిది. రాజ్ తరుణ్, శ్రీను నాకు మంచి ఫ్రెండ్స్. గోపీసుందర్ అద్భుతమైన మ్యూజిక్ అందించాడు.కుమారి 21 ఎఫ్ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.
భీమనేని శ్రీనివాస్ మాట్లాడుతూ...నాకు కావల్సిన వాళ్లు..నా మిత్రులు చేసిన సినిమా ఇది. నిర్మాతలకు తెలుగులో మొదటి సినిమా. రాజ్ తరుణ్ ను ఉయ్యాలా జంపాల సినిమా నుంచి చూస్తున్నాను. నేచరులర్ గా నటిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ హీరోగా నిలవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాతో శ్రీనివాస్ కి మంచి పేరు రావాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో అర్తన, విశ్వ, థామస్ రెడ్డి, మల్కాపురం శివ కుమార్, డి.ఎస్.రావు, హేమ తరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments