ప్రేక్షకులను ఆకట్టునే డిఫరెంట్ హర్రర్ కామెడీ ఫిల్మ్ నేను సీతాదేవి - హీరో సందీప్
Send us your feedback to audioarticles@vaarta.com
యువ కథానాయకుడు సందీప్ నటిస్తున్న సినిమా నేను సీతాదేవి. కోమలి, భవ్యశ్రీ కధానాయికలుగా నటిస్తున్నారు. సందీప్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో రణధీర్, వెన్నెల కిషోర్, జీవా, ధన్ రాజ్, గుండు హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. విభిన్న కథాంశంతో రూపొందిన నేను సీతాదేవి ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఈ సందర్భంగా హీరో సందీప్ మాట్లాడుతూ...ఆహ్లాదంగా సాగే ప్రేమకథా చిత్రమిది. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించాం. లవ్, హర్రర్, కామెడీ తో ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది. ఓ మంచి సినిమా చేయాలని యూనిట్ అంతా కష్టపడి వర్క్ చేసాం. చైతన్య అందించిన సంగీతం చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.
కథానాయిక కోమలి మాట్లాడుతూ...నా టాలెంట్ గుర్తించి అవకాశం ఇచ్చిన సందీప్ కి థ్యాంక్స్. ఈ చిత్రంలో సీతాదేవి పాత్ర పోషించాను. నటనకు అవకాశం ఉన్న మంచి క్యారెక్టర్ చేయడం చాలా సంతోషంగా ఉంది. హర్రర్ ఛాయలున్నా...ప్రేక్షకులు కోరుకునే వినోదం ఉంటుంది. మా ప్రయత్నానికి తగ్గ ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో నటులు రఘు, నవీన్, కొరియోగ్రాఫర్ సన్నీ, నిర్మాత డాక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments