రవితేజ సరసన హాట్ భామ సీరత్!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్లో ఫైర్‌బాల్ ఆఫ్ హాట్‌నెస్‌గా పేరు తెచ్చుకున్న భామ సీరత్ కపూర్. ‘రన్ రాజా రన్’ ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ.. ఆ తరువాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత ‘మా వింత గాధ వినుమా’లో సీరత్ కనిపించనుంది. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ముద్దుగుమ్ము అనేక మంది చిత్ర నిర్మాతలతో చర్చలు జరుపుతోంది.
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఖిలాడి’ చిత్రం కోసం చిత్ర నిర్మాతలు సీరత్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ‘టచ్ చేసి చూడు’ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రవితేజ.. ‘ఖిలాడి’ చేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ, సీరత్ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్‌ను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని చిత్రబృందం నమ్ముతోంది.
ఇక సీరత్ సినిమాల విషయానికి వస్తే.. 2014 లో టాలీవుడ్లో ‘రన్ రాజా రన్’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఆమె టైగర్ (2015), కొలంబస్(2015) వంటి కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో నటించింది. రాజు గారి గాది 2 (2017), ఒక్క క్షణం(2017), టచ్ చేసి చూడు(2018), కృష్ణ మరియు అతని లీలా (2020) వంటి చిత్రాల ద్వారా మంచి నటిగా సీరత్ గుర్తింపు పొందింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments