రవితేజ సరసన హాట్ భామ సీరత్!

  • IndiaGlitz, [Wednesday,September 16 2020]

టాలీవుడ్‌లో ఫైర్‌బాల్ ఆఫ్ హాట్‌నెస్‌గా పేరు తెచ్చుకున్న భామ సీరత్ కపూర్. ‘రన్ రాజా రన్’ ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ.. ఆ తరువాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ మంచి సక్సెస్ సాధించింది. ఆ తరువాత ‘మా వింత గాధ వినుమా’లో సీరత్ కనిపించనుంది. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ముద్దుగుమ్ము అనేక మంది చిత్ర నిర్మాతలతో చర్చలు జరుపుతోంది.

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఖిలాడి’ చిత్రం కోసం చిత్ర నిర్మాతలు సీరత్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ‘టచ్ చేసి చూడు’ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం రవితేజ.. ‘ఖిలాడి’ చేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ, సీరత్‌ల మధ్య కెమెస్ట్రీ బాగా వర్కవుట్ అవడంతో వీరిద్దరి కాంబినేషన్‌ను ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారని చిత్రబృందం నమ్ముతోంది.

ఇక సీరత్ సినిమాల విషయానికి వస్తే.. 2014 లో టాలీవుడ్‌లో ‘రన్ రాజా రన్’ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం ఆమె టైగర్ (2015), కొలంబస్(2015) వంటి కొన్ని బ్లాక్ బస్టర్ హిట్‌ మూవీస్‌లో నటించింది. రాజు గారి గాది 2 (2017), ఒక్క క్షణం(2017), టచ్ చేసి చూడు(2018), కృష్ణ మరియు అతని లీలా (2020) వంటి చిత్రాల ద్వారా మంచి నటిగా సీరత్ గుర్తింపు పొందింది.

More News

'రాజ్ పుత్`షూటింగ్ ప్రారంభం!!

బంజారా బిగ్ సినిమాస్ ప‌తాకంపై బంజార భాష‌లో `గోర్ మాటి`గా తెలుగులో `రాజ్ పుత్‌`గా రెండు భాష‌ల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రేఖ్యా నాయ‌క్‌.

రైల్వే శాఖ కీలక నిర్ణయం.. 21 నుంచి 40 కొత్త రైళ్లు..

కరోనా మహమ్మారిని జనాలు కొద్దికొద్దిగా విస్మరించడం మొదలు పెట్టారు. యథావిథిగా కార్యకలాపాలన్నీ కొనసాగుతున్నాయి.

సుశాంత్ ఫామ్‌ హౌస్ పార్టీలకు సారా.. రియా వచ్చేవారు: రాయిస్

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు అనేక మలుపులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఆర్జీవీ బయోపిక్ పార్ట్ 1 షూటింగ్ స్టార్ట్

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మూడు భాగాల బయోపిక్ లో తొలి భాగం షూటింగ్ బుధవారం హైదరాబాద్ లో ప్రారంభమైంది.

బెజవాడ కనకదుర్గమ్మ రథంలోని 3 వెండి సింహాలు మాయం

ఏపీ దేవాలయాల్లో చోటు చేసుకుంటున్న వరుస ఘటన ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.