నాగ్ తో శీరత్ కపూర్...

  • IndiaGlitz, [Monday,December 26 2016]

అక్కినేని నాగార్జున మ‌రోసారి డిఫ‌రెంట్‌గా చేస్తున్న ప్ర‌య‌త్నం రాజుగారి గ‌ది 2 చిత్రంలో న‌టిస్తున్నాడు. మ‌నుషుల ప్రాణాల‌తో ఆడుకునే క్యారెక్ట‌ర్‌లో నాగార్జున క‌నిపించ‌నున్నారు. చిన్న చిత్రంగా విడుద‌లైన సూప‌ర్‌హిట్ అయిన రాజుగారి గ‌ది సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని పివిపి సినిమా, ఓక్ ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్‌పై రూపొందిస్తుంటే ఓంకార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉన్నారు. అందులో ఒక హీరోయిన్‌గా శీర‌త్‌క‌పూర్ ఓకే అయ్యింద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఈ చిత్రంలో శీర‌త్‌క‌పూర్ ఓ డ్యాన‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లోనే క‌న‌ప‌డ్డ శీర‌త్‌క‌పూర్‌కు రాజుగారి గ‌ది2 సినిమా డిఫ‌రెంట్ మూవీ అవుతుంద‌ని ఆనంద‌ప‌డుతుంద‌ట‌.