రవితేజని టీజ్ చేసిన ముద్దుగుమ్మ
Send us your feedback to audioarticles@vaarta.com
'రన్ రాజా రన్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక సీరత్ కపూర్. గతేడాది నాగార్జున, సమంత నటించిన 'రాజుగారి గది2'లో ఓ కీలక పాత్రలో కనిపించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా వి.ఐ.ఆనంద్ డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఒక్క క్షణం'లో కూడా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో మెరిసింది సీరత్. త్వరలోనే.. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'టచ్ చేసి చూడు'లో ఇద్దరు కథానాయికలలో ఒకరిగా సందడి చేయబోతోంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "ఈ చిత్రంలో నాది సరదాగా సాగే పాత్ర. రవితేజ సినిమాలను గమనిస్తే.. హీరోయిన్లను ఆయన టీజ్ చేసే సందర్భాలు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే.. ఇందులో మాత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. నేనే రివర్స్‌లో రవితేజని టీజ్ చేస్తుంటాను. అంతేగాకుండా.. రవితేజను అది చెయ్, ఇది చేయ్, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటూ బాగా డామినేట్ చేసి ఇబ్బంది పెట్టేస్తుంటాను.
ఇక ఆయనతో కలిసి పని చేయడం ఒక ఫన్ రైడ్ లాంటిది. పేరుకే సీనియర్ హీరో కాని...అందరితో చక్కగా కలిసిపోతారు. పని విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ఇక ఈ సినిమాలో మాపై చిత్రీకరించిన ఒకే ఒక మాస్ సాంగ్‌కి నేను, రవితేజ కలిసి మాస్ స్టెప్పులేసాము. ఈ పాట అందరికి నచ్చుతుంది" అని ముక్తాయించింది సీరత్.
డెబ్యు డైరెక్టర్ విక్రమ్ సిరికొండ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com