మరో ఛాన్స్ కొట్టేసిన సీరత్
Send us your feedback to audioarticles@vaarta.com
రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగు సినిమాల బాట పట్టింది 'రన్ రాజా రన్' ఫేమ్ సీరత్ కపూర్. నాగార్జున నటించిన రాజు గారి గది2` సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గురువారం విడుదలైన ఒక్క క్షణం` సినిమాలో స్వాతిగా నటనకు అవకాశమున్న పాత్రలో కనిపించిన సీరత్.. తన పెర్‌ఫార్మెన్స్‌తో అందరినీ అలరిస్తోంది.
ప్రస్తుతం ఈ అమ్మడు.. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్నటచ్ చేసి చూడు`లో ఇద్దరు హీరోయిన్‌లలో ఒకరిగా నటిస్తోంది. అలాగే రవికాంత్ పెరేపు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో కూడా సీరత్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వీటితో పాటు పూల రంగడు`, లౌక్యం` వంటి సూపర్ హిట్ సినిమాల రచయిత శ్రీధర్ సీపాన.. మొదటిసారిగా మెగాఫోన్ పట్టుకుంటున్న చిత్రంలో కూడా నటించే ఛాన్స్ కొట్టేసింది సీరత్. కామిక్ డ్రామాగా రూపొందించబోయే ఈ మూవీకి సీరత్ పాత్రే కీలకమని తెలిసింది. చూస్తుంటే.. సీరత్ హవా వచ్చే ఏడాది బాగానే కొనసాగేటట్లుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com