కొత్త రూ.20 నోటు వచ్చేసింది.. ఇదిగో మీరూ లుక్కేయండి!
Send us your feedback to audioarticles@vaarta.com
ఇండియాలో పెద్ద నోట్ల రద్దు అనంతరం పలు కొత్తనోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే రెండువేలు, ఐదువందలు, వంద, యాభై, రెండు వందలు, పది రూపాయిలు ఇలా రిలీజ్ చేసిన ఆర్బీఐ త్వరలోనే కొత్త 20 రూపాయిల నోట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కాగా.. ఇప్పటికే ఇరభై రూపాయిల నోట్లు కొత్తవి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త నోట్లు వచ్చినంత వరకూ ఇప్పుడున్న పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది.
కొత్త నోట్ ఎలా ఉంటుంది..!?
మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు రంగుల కలయికలో ఉంటాయి. నోటు మీద ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. దీంతో పాటు అశోకుడి స్తంభం కూడా ఉంటుంది. కొత్త రూ.20 నోటు వెనుక భాగంలో ఎల్లోరా గుహల చిత్రం ఉంటుంది. దీంతో పాటు ‘స్వచ్ఛ భారత్ లోగో’ కూడా ఉంటుంది. పై వాటిలో ఏ ఒక్కటి లేకపోయినా అది దొంగనోటే అన్న మాట. త్వరలోనే ఈ కొత్త నోట్లు విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.. కానీ ఫలానా రోజు అని మాత్రం పక్కాగా చెప్పలేదు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com