KCR:మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదింపు.. గులాబీ శ్రేణులు ఆగ్రహం..
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీలు చేసిన ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రతను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గన్మెన్లను వాపస్ తీసుకోవాలని జిల్లాల యంత్రాంగానికి అడిషనల్ డీజీ నుంచి ఆదేశాలు అందాయి. ఇకపై సాధారణ ఎమ్మెల్యేలకు కేటాయించనిట్లుగానే మాజీ మంత్రులకు కూడా 2+2 భద్రత కల్పిస్తున్నట్టు తెలిపింది.
ప్రభుత్వం నిర్ణయంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కల్పించే భద్రతలో కూడా మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రతిపక్ష నేత హోదా ఉన్న కేసీఆర్‌కు నలుగురు గన్మెన్లతో వై కేటగిరి భద్రత కల్పించారని సమాచారం. అలాగే ఆయన కాన్వాయ్‌లో ఓ ఎస్కార్ట్, పైలట్ వెహికల్ ఉంటుంది. ఆయన ఇంటి ముందు ఓ సెంట్రీతో పాటు మరో ఇద్దరు కాపలా ఉండనున్నారు.
మరోవైపు ఎమ్మెల్యేలుగా విజయం సాధించిన మాజీ మంత్రులకు 2+2 భద్రత ప్రొవైడ్ చేశారు. వారిలో కేటీఆర్, హరీశ్‌రావు కూడా ఉన్నారు. అయితే ఓడిపోయిన నేతల భద్రతను మాత్రం పూర్తిగా తొలగించారు. అన్ని పార్టీల నేతలకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఎవరెవరికి గన్‌మెన్స్ అవసరమనే దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షిస్తారని.. అనంతరం
వారికి గన్‌మెన్స్ కేటాయించే అవకాశం ఉందని వెల్లడించింది.
ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు ఒక్కసారిగా భద్రత కుదించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి మావోయిస్టులు లేదా ఇతర అసాంఘిక వ్యక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉండొచ్చని.. అలాంటప్పుడు భద్రతను ఎలా తగ్గిస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ అధినేతకు భద్రతను తగ్గించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout