విశాల్ ఇంటికి భద్రత...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళ హీరో, తమిళ నిర్మాతల మండలి ప్రెసిడెంట్, నడిగర్ సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన నటించిన ఇరుంబుతిరై సినిమా ఈ వివాదానికి కారణం.
ఈ సినిమాలో ఆధార్‌కార్డ్ గురించి తప్పుడు సమాచారం ఉందని, కేంద్ర డిజిటల్ పథకం గురించి తప్పుడు సమాచారం ఉందని విమర్శలు వచ్చాయి.
అలాగే హై కోర్టులో వాజ్యం నమోదు చేశారు. అయితే కోర్టు వాజ్యాన్ని తోసిపుచ్చింది. ఎట్టకేలకు ఇరుంబుతిరై సినిమా విడుదలైంది.
దీంతో విశాల్ ఇంటిని ముట్టడించనున్నట్లు కొన్ని హిందూ సంస్థలు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో విశాల్ ఇంటికి, ఇరుంబు తిరై థియేటర్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout