తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం సినీగోయర్స్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తాం - సెక్రెటరీ రామకృష్ణ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించిన వారికి 1970 సంవత్సరం నుంచి ప్రతిష్టాత్మకంగా సినీ గోయర్స్ పేరిట అవార్డులు ఇస్తూ సన్మానిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో గౌరవంగా భావించే ఈ అవార్డుల్ని 2017 సంవత్సరానికి గాను ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సినీగోయర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బి.రామకృష్ణ తెలిపారు.
2017 సంవత్సరానికి గాను తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు 49వ సినీ గోయర్స్ అవార్డుల్ని మే 13వ తేదీన హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, తెలుగు లలిత కళాతోరణంలో ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. దీంతో పాటు శ్రీ శోభన్ బాబు రోలింగ్ షీల్డ్ పేరిట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, మరియు ఉత్తమ దర్శకుడికి ఇచ్చే అవార్డును సైతం అదే వేదికపై ఇవ్వనున్నారు.
ఈ అవార్డ్స్ ఫంక్షన్ కి సంబంధించిన మీడియా సమావేశం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. సీనియర్ నటుడు వైజాగ్ ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు వరదరాజు, నటి అనూష తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా..సెక్రెటరీ రామకృష్ణ మాట్లాడుతూ... సినీగోయర్స్ 49వ అవార్డ్స్ ఫంక్షన్ చేయడం అంటే అంత సులువు కాదు. అప్పట్లో బ్యాలెట్ బాక్సుల్లో నామినేషన్ వేసి అవార్డులకు ఎంపిక చేసేవాళ్ళం. చాలా జెన్యూన్ గా ఇస్తున్నాం. మనిఫూలేషన్ కి అవకాశం లేదు. మేము అవార్డ్స్ ఇచ్చిన తర్వాతే వేరే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఈ ఫంక్షన్ కి సహకరిస్తున్న కేసీఆర్ గారికి చాలా థాంక్స్.
తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ చేస్తోంది. మేము ఈ అవార్డ్స్ వాల్యూ ఉండేలా ఇస్తున్నాం. మా నాన్న గారు మొదలుపెట్టారు. ఆయన తర్వాత నేను కంటిన్యూ చేస్తున్నా. తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఈ అవార్డ్స్ ఇస్తుంటాం. 49వ సినీ గోయర్స్ అవార్డుల్ని మే 13వ తేదీన హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్, తెలుగు లలిత కళాతోరణంలో ప్రదానం చేస్తాం.
దీంతో పాటు శ్రీ శోభన్ బాబు రోలింగ్ షీల్డ్ పేరిట ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, మరియు ఉత్తమ దర్శకుడికి ఇచ్చే అవార్డును సైతం అదే వేదికపై ఇవ్వనున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారి మఖ్య అతిథిగా రానున్నారు.
ఎంపీలు కేశవ రావ్, టి.సుబ్బరామి రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కెవి రమణ, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ టూరిజం సెక్రెటరీ బుర్రా వెంకటేశం, డిపార్ట్ మెంట్ ఆఫ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, టిఎస్ఎఫ్ డిసి ఛైర్మన్ శ్రీ రామ్మోహన్ తో పాటు పలువురు ప్రముఖ ఆర్టిస్టులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేయనున్నారు. ఆ కార్యక్రమం తెలంగాణ టూరిజం మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఎండ్ కల్చర్, తెలంగాణ ప్రభుత్వ సౌజన్యంతో నిర్వహిస్తున్నాం. అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments