"తాకట్టులో సచివాలయం" వార్త పూర్తి అవాస్తవం: APCRDA
Send us your feedback to audioarticles@vaarta.com
యెల్లో మీడియా ప్రచారం చేస్తున్న "తాకట్టులో సచివాలయం" వార్త పూర్తి అవాస్తవమని ఏపీసీఆర్డీఏ(APCRDA) తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. "సచివాలయం తాకట్టు వార్త అవాస్తవం. రాష్ట్ర సాధారణ పరిపాలనశాఖ నుంచి ఈవిషయమై ఏపీసీఆర్డీకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కన్సార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీసీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించటం జరిగింది. రాష్ట్ర సచివాలయంలోని అయిదు భవనాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు పెట్టినట్లు వచ్చిన వార్త పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల నుండి సీఆర్డీఏ ఎటువంటి రుణాన్ని పొందలేదు. ఈ మేరకు సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నివేదించటం జరిగింది.
రాయపూడిలోని అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ జీవో నెంబరు 332, అక్టోబర్ 15 2018 ప్రకారం 2,060 కోట్ల రూపాయల రుణాన్ని కన్టార్టియం బ్యాంకులు అయినటువంటి (యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, బ్యాంకు ఆఫ్ బరోడా మరియు ఇండియన్ బ్యాంకులు) మంజూరు చేశాయి. ఇందులో రూ.1,955 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు సీఆర్డీకు రిలీజ్ చేయటం జరిగింది.
2017వ సంవత్సరంలో హడ్కో రూ.1275 కోట్లను మౌలిక సదుపాయాల కొరకు రుణాన్ని మంజూరుచేసింది. అందులో రూ.1,151 కోట్లు మాత్రమే సీఆర్డీఏకు రిలీజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కంఫర్ట్ లేటర్ జారీ చేయటం జరిగింది. ఏపీ సీఆర్డీఏ సచివాలయ భవనాలను తాకట్టు పెట్టి ఎటువంటి రుణమూ పొందలేదు అని తెలియజేస్తున్నాం. ఇటువంటి నిరాధారమైన కథనాన్ని ప్రచురించటంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయటం జరుగుతుంది. అని ఈ లేఖలో పేర్కొంది.
కాగా రాష్ట్ర సచివాలయాన్ని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు తాకట్టు పెట్టి రూ.370కోట్లు రుణం తీసుకున్నారని కొన్ని పత్రికలు ప్రచురించాయి. దీంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై వైసీపీ నేతలు స్పందిస్తూ ప్రతిపక్షాలు, యెల్లో మీడియా ఫేక్ ప్రచారానికి ఒడిగట్టారని తీవ్రంగా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ అధికారంలోకి రానున్నారని అనేక సర్వేల్లో తేలడంతో విపక్షాలు ఉలిక్కిపడ్డాయని.. దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారాలకు తెరదీశాయని ఫైర్ అవుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout