ఆర్ ఆర్ ఆర్ వెనుక సీక్రెట్ అదేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లతో డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం అనౌన్స్‌మెంట్ రోజు నుండి అంచనాలను క్రియేట్ చేసుకుంది. హీరోల పాత్రలు, కథా నేపథ్యంపై పలు రకాల వార్తలు వినపడుతూ వచ్చాయి. అయితే ఈ సినిమా 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోందనేది మాత్రం పక్కా.
ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్‌గా ఆర్ ఆర్ ఆర్ అని పెట్టారు. అసలు టైటిల్ ఇంకా పెట్టలేదు. ఈ రోజు సినిమా ప్రారంభం అవుతుంది. కాగా ఈ సినిమా టైటిల్‌ను రాజమౌళి తెలివిగా పెట్టేశాడని ఆ క్లూ ఆర్ ఆర్ ఆర్‌లోనే ఉందని అంటున్నారు.
అందరూ ఆర్ ఆర్ ఆర్ అంటే రామారావు, రామ్‌చరణ్, రాజమౌళి అనుకుంటున్నారని.. . అయితే అదే టైటిల్ అని `రామ రావణ రాజ్యం` అనేదే టైటిల్ అని.. మూడు పదాల్లోని తొలి అక్షరాలతో వర్కింగ్ టైటిల్‌ను పెట్టి మరోలా డైవర్ట్ చేశారని అంటున్నారు. మరి యూనిట్ దీనిపై స్పందిస్తుందా చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com