విజయ్ దేవరకొండ కి కలిసొస్తున్న సెకండాఫ్
Send us your feedback to audioarticles@vaarta.com
నాని నటించిన ఎవడే సుబ్రమణ్యంతో నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. పెళ్లిచూపులుతో కథానాయకుడుగా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ద్వారక విజయ్‌ని నిరాశపరిచింది. ఇక వారం రోజుల క్రితం విడుదలైన అర్జున్ రెడ్డితో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు సదరు యువ కథానాయకుడు. ఈ చిత్రం రెండు రోజుల్లోనే బ్రేక్ఈవెన్ అయ్యింది.
విజయ్‌కి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన రెండు చిత్రాలు పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి ని గమనిస్తే ఓ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే.. గతేడాది సెకండాఫ్ (జులై)లో పెళ్లి చూపులు రిలీజైతే.. ఈ ఏడాది సెకండాఫ్ (ఆగస్టు)లో అర్జున్ రెడ్డి విడుదలవడం. అంటే.. రెండు వరుస సంవత్సరాలలో సెకండాఫ్‌లు విజయ్‌కి బాగా కలిసొచ్చాయన్నమాట. మరి వచ్చే ఏడాది కూడా విజయ్ ఈ ఫీట్ ని రిపీట్ చేస్తాడేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments