హిట్ ఇస్తేనే మ‌హేష్ రెండో ఛాన్స్‌ ఇస్తాడా?

  • IndiaGlitz, [Wednesday,October 14 2015]

మ‌హేష్‌బాబుతో సినిమా చేసే అవ‌కాశం ఓ సారి రావ‌డ‌మే అదృష్టంగా భావిస్తారు ద‌ర్శ‌కులు అయినా.. క‌థానాయిక‌లైనా. ఇక రెండోసారి ఛాన్స్ ద‌క్కితే వారి ఆనందం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే మ‌హేష్ మాత్రం రెండో ఛాన్స్ అంత ఆషామాషీగా ఇవ్వ‌డు. ఓ సారి సినిమా చేసి ఫ్లాప్ మూట‌గ‌ట్టిన హీరోయిన్ కానీ, ద‌ర్శ‌కుడు కానీ మ‌ళ్లీ మ‌హేష్‌తో మ‌రోసారి ప‌నిచేసిన వైనం ఇప్ప‌టివ‌ర‌కైతే లేదు.

కానీ రెండో ఛాన్స్ ద‌క్కించుకున్న హీరోయిన్స్ కానీ, ద‌ర్శ‌కులు కానీ క‌చ్చితంగా హిట్ ఇచ్చిన లిస్ట్‌లో ఉన్న‌వారే. హిట్ ఇచ్చిన అంద‌రికీ రెండో అవ‌కాశం ఇవ్వ‌కపోవ‌చ్చు కానీ.. కొంద‌రికీ మాత్రం సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు ప్రిన్స్ మ‌హేష్‌బాబు. హీరోయిన్స్ ప‌రంగా త్రిష‌, స‌మంత.. తాజాగా కాజ‌ల్ (బ్ర‌హ్మోత్స‌వం) ఈ జాబితాలో చేరితే.. ద‌ర్శ‌కుల్లో గుణ‌శేఖ‌ర్‌, త్రివిక్ర‌మ్‌, పూరీ జ‌గ‌న్నాథ్‌, శ్రీ‌ను వైట్ల‌, తాజాగా.. శ్రీ‌కాంత్ అడ్డాల (బ్ర‌హ్మోత్స‌వం) ఈ జాబితాలో ఉన్నారు. మున్ముందు కూడా మ‌హేష్ ఇదే శైలిని ఫాలో అవుతాడో.. లేదంటే ఫ్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కులు, హీరోయిన్‌ల‌కూ రెండో ఛాన్స్ ఇస్తాడో చూడాలంటున్నారు ప‌రిశీల‌కులు.

More News

ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నాన్నకు ప్రేమతో..సినిమా చేస్తున్నారు.ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

చ‌ర‌ణ్ టార్గెట్ 102

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడుగా టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మైన రామ్‌చ‌ర‌ణ్ త‌న తొలి చిత్రం 'చిరుత'తో ఆక‌ట్టుకున్నాడు.

చిరుకీ ఓ లెక్కుందా?

ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తరువాత కథానాయకుడుగా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.వినిపిస్తున్న కథనాల ప్రకారం..

ఆర్నాల్డ్ ఒప్పుకోవ‌డం లేదా?

సూప‌ర్ స్టార్ రజ‌నీకాంత్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'రోబో' ఎంతంటి సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు 'రోబో' చిత్రానికి సీక్వెల్‌గా 'రోబో2'ను రూపొందిస్తున్నారు.

'డిక్టేటర్' ఎటువైపు?

నందమూరి బాలకృష్ణ ముచ్చటగా ముగ్గురు కథానాయికలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడం అనే ట్రెండ్ ''సమరసింహా రెడ్డి''తో ఊపందుకుంది.