హిట్ ఇస్తేనే మహేష్ రెండో ఛాన్స్ ఇస్తాడా?
Send us your feedback to audioarticles@vaarta.com
మహేష్‌బాబుతో సినిమా చేసే అవకాశం ఓ సారి రావడమే అదృష్టంగా భావిస్తారు దర్శకులు అయినా.. కథానాయికలైనా. ఇక రెండోసారి ఛాన్స్ దక్కితే వారి ఆనందం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మహేష్ మాత్రం రెండో ఛాన్స్ అంత ఆషామాషీగా ఇవ్వడు. ఓ సారి సినిమా చేసి ఫ్లాప్ మూటగట్టిన హీరోయిన్ కానీ, దర్శకుడు కానీ మళ్లీ మహేష్‌తో మరోసారి పనిచేసిన వైనం ఇప్పటివరకైతే లేదు.
కానీ రెండో ఛాన్స్ దక్కించుకున్న హీరోయిన్స్ కానీ, దర్శకులు కానీ కచ్చితంగా హిట్ ఇచ్చిన లిస్ట్‌లో ఉన్నవారే. హిట్ ఇచ్చిన అందరికీ రెండో అవకాశం ఇవ్వకపోవచ్చు కానీ.. కొందరికీ మాత్రం సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు ప్రిన్స్ మహేష్‌బాబు. హీరోయిన్స్ పరంగా త్రిష, సమంత.. తాజాగా కాజల్ (బ్రహ్మోత్సవం) ఈ జాబితాలో చేరితే.. దర్శకుల్లో గుణశేఖర్, త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్, శ్రీను వైట్ల, తాజాగా.. శ్రీకాంత్ అడ్డాల (బ్రహ్మోత్సవం) ఈ జాబితాలో ఉన్నారు. మున్ముందు కూడా మహేష్ ఇదే శైలిని ఫాలో అవుతాడో.. లేదంటే ఫ్లాప్ ఇచ్చిన దర్శకులు, హీరోయిన్‌లకూ రెండో ఛాన్స్ ఇస్తాడో చూడాలంటున్నారు పరిశీలకులు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com