close
Choose your channels

ఘనంగా జరుపున్న 'సెబాస్టియన్‌ పిసి524’ ప్రి. రిలీజ్ ఈవెంట్

Wednesday, March 2, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పల్లె వాతావరణానికి, స్వచ్ఛమైన ప్రేమకథకు పెద్దపీట వేస్తూ రూరల్ బ్యాక్ డ్రాప్ లో నైట్‌ బ్లైండ్‌నెస్‌ (రేచీకటి) నేపథ్యం లోని కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న కామెడీ థ్రిల్లర్ “సెబాస్టియన్ PC 524.". "రాజావారు రాణి గారు", “యస్. ఆర్.కళ్యాణమండపం” వంటి డీఫ్రెంట్ కథలని సెలెక్ట్ చేసుకుంటూ నటుడుగా ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను సంపాదించుకొన్న నటుడు కిరణ్ ఆబ్బవరం. ఇప్పటి తను చేసింది రెండు సినిమాలే అయినా ఎవరూ చేయనటువంటి కొత్త కథలతో ముందుకు వెళ్తూ ఎంతో బిజీ హీరో గా మారిపోయాడు.తాజాగా కిరణ్ అబ్బవరం రేచీకటి కొన్సెప్టు ఉన్న కొత్త కథను చాలెంజ్ గా తీసుకుని చేస్తున్న "సెబాస్టియన్ PC 524" చిత్రాన్ని ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో జ్యోవిత సినిమాస్‌ పతాకంపై బి . సిద్దారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు, ట్రైలర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ప్రమోద్ , రాజు ,,జయచంద్రా రెడ్డి లు సహా నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.నువేక్ష (నమ్రతా దారేకర్) , కోమలి ప్రసాద్, హీరోయిన్లు గా నటిస్తున్న "సెబాస్టియన్‌ పిసి524’. చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న థియేటర్స్‌లలో ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది.ఈ సందర్భంగా ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్ లో సినీ అతిరథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకులు వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, మైత్రి మూవీ మేకర్స్ రవి శంకర్, చెర్రీ, సీనియర్ నటుడు సాయి కుమార్, హీరోలు అడవి శేష్ ,ఆకాష్ పూరి,సప్తగిరి నిర్మాత కోడి దివ్య,లిరిక్స్ రైటర్ భాస్కర పట్ల తదితరులు చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియ జేశారు. "సెబాస్టియన్‌ పిసి524’ మొదటి బిగ్ టికెట్ ను హీరోలు అడవి శేష్, ఆకాష్ పూరిలు విడుదల చేశారు.అనంతరం

మైత్రి మూవీ మేకర్స్ చెర్రీ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది చూసిన వెంటనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో రేచీకటి వున్న ఒక కానిస్టేబుల్ అండర్ లో ఒక క్రైమ్ జరుగుతుంది. తను దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనే టటువంటి మంచి సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్న కిరణ్ కు ధన్యవాదాలు.మంచి పొటెన్షియల్ పర్ఫార్మెన్స్ కు మంచి స్కోప్ ఉన్న ఈ చిత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. కిరణ్ తో మేము ఒక సినిమా చేస్తున్నాం అది కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కిరణ్ చాలా మల్టీ టాలెంటెడ్ హీరో తనేమి చేసినా చాలా హానెస్ట్ గా చేస్తాడు. నాలెడ్జ్ డైరెక్షన్లో లో గాని, ఎడిటింగ్ లో గాని, డైలాగ్ రైటింగ్ లో గాని చాలా మంచి నాలెడ్జ్ ఉంది.కరోనా టైంలో కూడా ఎవరు సినిమా రిలీజ్ చేయడానికి ముందు రాని టైంలో "ఎస్ ఆర్ కళ్యాణమండపం" రిలీజ్ చేసి విజయం సాధించాడు.ఇలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించి కిరణ్ కు మంచి పేరు రావాలని కోరుతున్నాను అన్నారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. కిరణ్ చేసిన సినిమాలు చూశాను. తెలుగు ఇందుష్ట్రీలో గొప్ప నటుడు అవుతాడు. ఈ సినిమాలో అందరూ చాలా బాగా చేశారు. చిత్తూరు, మదనపల్లి ఏరియకు ఒక సెంటిమెంట్ ఉంది.ఆ బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయి.ఈ మధ్య వచ్చిన అల్లు అర్జున్ "పుష్ప" కూడా గొప్ప విజయం సాధించింది. మళ్ళి ఇప్పుడు అదే సెంటిమెంటు తో వస్తున్న సెబాస్టియన్ కూడా గొప్ప హిట్ అవుతుందని నమ్ముతున్నాను.ఈ నెల 4 న వస్తున్న ఈ సినిమా కూడా కిరణ్ కు గొప్ప హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

నటుడు సాయికుమార్ మాట్లాడుతూ .. ఈ సినిమాలోని రాజాధిరాజా పాట చూస్తుంటే నాకు అమ్మంటే అనే పాట గుర్తుకొస్తుంది. యస్.ఆర్. కళ్యాణమండపంలో తండ్రి గా నన్ను గెలిపించి నన్ను మీసం తిప్పి టట్లు చేశాడు కిరణ్, ఇప్పుడు ఈ సినిమాతో తనే మీసం తిప్పుతున్నాడు. ఈ "సెబాస్టియన్ పీసి 524" అగ్ని IPS గర్వపడేలా చేస్తాడని నమ్ముతున్నాను అన్నారు

దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ .. ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది.కిరణ్ మంచి కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నాడు తనకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుతూ దర్శక,నిర్మాతలకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు

హీరో సప్తగిరి మాట్లాడుతూ .. ఈమధ్య కిరణ్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాను. సినిమా కోసం తాపత్రయ పడే వ్యక్తి కిరణ్.తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలదొక్కుకుంటాడు అనే నమ్మకం ఉంది. ఎస్ ఆర్ కళ్యాణ మండపం" అబ్బ అనిపించిన కిరణ్ "సెబాస్టియన్" సినిమాతో శభాష్ అనిపించేలా సినిమా ఉండాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు.

అడవి శేష్ మాట్లాడుతూ.. కిరణ్ అంటే నాకు చాలా ఇష్టం.ఈ ఫంక్షన్ కు నేను కిరణ్ అభిమానిగా వచ్చాను. ఎందుకంటే కిరణ్ 1991 షార్ట్ ఫిల్మ్ తీశాడు.ఆ షార్ట్ ఫిల్మ్ చూసినపుడు ఇలాంటి సినిమా నేను చెయ్యాలి అనుకున్నప్పుడే కిరణ్ చేసేసాడు.ఇదొక్కటే కాదు లాస్ట్ ఇయర్ నైట్ బ్లైండ్‌నెస్‌ మీద మంచి స్క్రిప్ట్ విన్నాను.ఇది బాగుందే ఇలాంటి కథ ను ఎవ్వరూ చేయలేదు అని మా ఫ్రెండ్స్ తో చెప్పినప్పుడు ఇలాంటి కథను కిరణ్ చేస్తున్నాడు అని చెప్పారు.ఎవరూ చెయ్యని డీఫ్రెంట్ కథలను నేను చెయ్యాలి అనుకున్నపుడు తను చేయడం చూసి కిరణ్ పై ఇష్టం ఏర్పడింది. మంచి టీం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. కిరణ్ పెరఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం.తమిళ్ లో శివకార్తికేయన్ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఈ రోజు పెద్ద స్టార్ అయ్యాడు. కిరణ్ కూడా తనలా బిగ్ స్టార్ అవ్వాలని కోరుతున్నాను.ఈ నెల 4 న వస్తున్న ఈ సినిమా కిరణ్ కు, దర్శక, నిర్మాతలకు, చిత్ర యూనిట్ కు మంచి పేరు రావాలని మనస్పూర్తిగా కోరుతున్నాను అన్నారు

నిర్మాత సిద్దారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన రామాంజనేయులు రెడ్డి కి ఈ చిత్రం అంకితం చేస్తున్నాము. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అందరి హార్డ్ వర్క్ ను నేను దగ్గర నుండి చూశాను.కిరణ్ కష్టపడే తత్వానికి ఇన్స్పైర్ అయ్యి తనకు సపోర్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. "యస్.ఆర్.కళ్యాణమండపం" నుండి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. కిరణ్ కూడా చాలా మంది కొత్తవాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వారందరూ కూడా సక్సెస్ కావాలనే ఉద్దేశ్యంతో టీంలో ఉన్న ప్రతి ఒక్కరినీ ఫ్యామిలీ మెంబెర్ లా ట్రీట్ చేసేవాడు.జ్యోవిత సినిమాస్‌ ద్వారా మేము కూడా చాలా మందికి అవకాశం ఇవ్వాలని కోరుకొంటున్నాము.కిరణ్ ఒక్కడే కాకుండా కిరణ్ ఒక్కడే కాకుండా కిరణ్ తో పాటు ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలని కోరుకుంటూ అన్నారు.మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ప్రమోద్ రాజు మాట్లాడుతూ.. మా ప్రి రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మా సెబాస్టియన్ PC 524" చిత్రాన్ని ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, జ్యోవిత సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాము. సిద్దారెడ్డి, నేను మంచి ఫ్రెండ్స్ .మేము గత 15 సంవత్సరాలుగా సాప్ట్ వేర్ ఇంజనీర్స్ గా వర్క్ చేస్తున్నాము. సాఫ్ట్వేర్ రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేయడానికి కారణమైన వ్యక్తి కిరణ్ అబ్బవరం. రాజావారు రాణి గారు సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకొన్న తరువాత తండ్రిని గెలిపించే టటువంటి "యస్. ఆర్.కళ్యాణ మండపం” సినిమాలో చాలా చక్కగా నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఆ చిత్రంతో మా జర్నీ స్టార్ట్ అయ్యింది.దర్శకుడు బాలాజీ రేచీకటి కొన్సెప్టు ఉన్న సెబాస్టియన్ కథను మాకు వినిపించిన్నపుడు కిరణ్ చేస్తున్న మూడవ సినిమాకే ఈ కథ ఏంటని భయమేసింది. అయితే కిరణ్ ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకొని చేశాడు. తన గత చిత్రాలలో ఎలాంటి పెర్ఫార్మన్స్ చేసి అందరి అభిమానాన్ని పొందాడో అంతకంటే ఎక్కువగా మీ అందరి ఆధారాభి మానాన్ని పొందడానికి శబా మార్చి 4 న ఛార్జ్ తీసుకోబోతున్నాడు.సహ నిర్మాత గా ఉన్న రామంజులు రెడ్డి కిరణ్ కు సొంత అన్న. తను మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.తను మా మధ్య లేకున్నా శభా కోసం తను చాలా కష్టపడ్డాడు.తన ఆత్మకు శాంతి చేకూరాలని మా సెబాస్టియన్ సినిమాను మా మిత్రుడు రామంజి రెడ్డి అంకితం చేస్తున్నాము.అంతా కొత్త వారైన యంగ్ టీం తో వస్తున్నాము.ఎలాగైతే యస్. ఆర్.కళ్యాణమండపం” ద్వారా ఇందుష్ట్రీకు శ్రీధర్ గాదె ను దర్శకుడు గా పరిచయం చేశామో మా తదుపరి ప్రయత్నంగా సెబాస్టియన్ ద్వారా బాలాజీ సయ్యపురెడ్డిని పరిచయం చేస్తున్నాము.తనకు ఇది మొదటి సినిమా అయినా చాలా చక్కగా చేశాడు. మంచి టెక్నికల్ వ్యాల్యూస్ తో తీశారు.ఈ చిత్రానికి జిబ్రాన్ మ్యూజిక్ ప్రత్యేకంగా నిలుస్తుంది.ఇందులోని పాటలను ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. కిరణ్ నటనతో, జిబ్రాన్ మ్యూజిక్ తో రెండున్నర గంటల సేపు అందరినీ కట్టిపడేసే కథనంతో ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది.నటీనటులు అందరూ కూడా చాలా చక్కగా నటించారు. టెక్నీషియన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు.మార్చి 4 న వస్తున్న మా సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

చిత్ర దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన మీ అందరికీ ఎంత ఎంగేజింగ్ అనిపించిందో అంతకుమించి ఈ సినిమా ఉంటుంది.సినిమా చూసిన తరువాత నేను ఏదైతే రాసుకొన్నానో దానికి రెండింతలు ఎక్కువగా సినిమాలో కనిపించింది. సినిమా ఇంత బాగా రావడానికి కారణం నా డైరెక్షన్ టీం, ప్రొడక్షన్ టీం అందరూ కూడా నిద్ర లేకుండా చాలా కష్టపడ్డారు వారందరికీ ధన్య వాదాలు. ఇప్పుడు చూసిన విజువల్స్ కంటే సినిమా చాలా బాగుంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ఇది ఒరిజినల్ గా తీసినట్టు అనిపిస్తుంది.ప్రతి క్యారెక్టర్ కు డార్క్ షెడ్ ఉంటుంది.ఈ చిత్రాన్ని మదనపల్లె లో చాలా టిపికల్ కండిషన్ లో 36 డేస్ లో ఈ సినిమా తియ్యడం జరిగింది. కోమలి,నివేక్ష లు కూడా చాలా చక్కగా నటించారు.ఎడిటర్ విప్లవ్ చాలా నీట్ గా కట్ చేశాడు.తను ఈసినిమా తరువాత బెస్ట్ ఎడిటర్ అవుతాడు.కిరణ్ కు ఈ కథను 2019లో చెప్పడం జరిగింది."సెబాస్టియన్” అను కానిస్టేబుల్ ను తనకున్న నైట్ బ్లైండ్ నెస్ ద్వారా తను ఎం ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే కథను చెప్పిన వెంటనే కథ బాగుందని ఈ సినిమా చేద్దామన్నాడు. చెప్పిన 20 నిమిషాలకి చేద్దాం అని చెప్పడంతో నేను చాలా ఆనంద పడ్డాను. అంతకుముందు ఈ కథను చాలా మందికి చెప్పాను. అందరూ కూడ కథను మార్పులు చేయమని చెప్పారు. అయితే కిరణ్ మాత్రం ఒక్క చేయింజ్ లేకుండా కథను ఒకే చేశాడు.నేను లైఫ్ లో ఇద్దరు హీరోలు వున్నారు.వారిలో ఒకరు సినిమాలో కనిపించే హీరో "సెబాస్టియన్" తను ఒక ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ ను బ్రేక్ చెయ్యడు. రెండోది కిరణ్ అబ్బవరం వీరిద్దరినీ ఎప్పటికీ మరచిపోను.సినిమా చాలా బాగా వచ్చింది.సినిమా చూస్తున్న మీకు సినిమాలో కిరణ్ కనిపించడు "సెబాస్టియన్" మాత్రమే కనిపించేలా చాలా ఎక్స్ట్రార్డినరీ గా అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు.ఈ సినిమా చూసి బయటికి వచ్చిన వారందరికీ సెబాస్టియన్ క్యారెక్టర్ మీతో కొద్ది రోజులు ఉండిపోతుంది.జిబ్రాన్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలెట్ అవుతుంది. ఇందులోని పాటలు చాలా బాగా వచ్చాయి.ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన కిరణ్ కు , నిర్మాతలకు, ధన్యవాదాలు. ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని కోరుతున్నాను అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఎంతోమంది పెద్దలు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమానికి వచ్చారు వారందరికీ నా ధన్యవాదాలు.నాకు ఇండస్ట్రీలో ఒక అవకాశం విలువ ఏంటో తెలుసు.ఆ అవకాశం కెమెరా ముందు నిల్చోవడమే అదృష్టంగా.. అదొక వరంగా బావిస్తున్నాను.మన ఇంటికి ఒక గెస్ట్ వస్తే వారిని ఎంతో బాగా చూసుకుంటాం.అలాంటింది మన కోసం థియేటర్స్ కు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి వినిమా చూసే ప్రేక్షకులను నిరాశ పరచకూడదని చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా తియ్యడం జరిగింది.ఈ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ అందరూ కూడా నిద్రలేకుండా పని చేశారు.ఈ సినిమా చూసిన తరువాత ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి సినిమా చేశారని మెచ్చుకుంటారు. అలాగే ఈ సినిమాకోసం కష్టపడిన సెబాస్టియన్ టీం కు రెస్పెక్ట్ ఇస్తారని నమ్ముతున్నాను.ఈ మధ్య విడుదల చేసిన ట్రైలర్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. తల్లి కొడుకు దగ్గర ఒక ప్రామిస్ తీసుకుంటది నాన్నా నీకు రేచీకటి నా బిడ్డకు రేచీకటి అనే విషయం ప్రపంచానికి తెలిస్తే జాలిగా చూస్తారు.నీకు రేచీకటి ఉన్న విషయం ప్రపంచానికి తెలియకూడదు అలా అని చెప్పి నువ్వు పోలీస్ జాబ్ చెయ్యేలనేది మీ నాన్న కల నా..కల ఎన్నో షాక్రిఫైస్ చేసి ఈ పోలీస్ జాబ్ ఇప్పించాము.ఎట్టి పరిస్థితుల్లో ఈ పోలీస్ జాబ్ ను మిస్ చేయద్దు అని ప్రామిస్ తీసుకుని వాడి లైఫ్ ఎలా సర్వైవ్ అయ్యింది.తను ఎలా కష్టపడ్డాడు తనకు ఎలాంటి కష్టం వచ్చింది.దాన్ని ఎలా ఓవర్ కం ఆయ్యడు అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. ఈ సినిమా చూసిన అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.అతి తక్కువ సమయంలోనే నాకు జిబ్రాన్ వంటి సంగీత దర్శకుడు నా సినిమాకు పనిచేస్తారు అనుకోలేదు.తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. రాజు, ప్రమోద్ అన్నలు మా సిద్దారెడ్డి మామ నాకెంతో సపోర్ట్ గా నిలిచారు.ఈ సినిమా ఆగి పోకూడదని చాలా కష్టపడి ఈ సినిమాను పూర్తి చేశాడు.తను నాకోసం తాను చాలా షాక్రిఫై చేశాడు.నాకు సినిమా అంటే ఇష్టం.ప్రాణం దానిని గురించాడు మా అన్న.ఎక్కడో ఊర్లో టికెట్ కొనుకొని సినిమ చూసే నన్ను ఈ రోజు హీరో ను చేశాడు అని బావోద్వేగాయానికి లోనైనాడు. తను ఈ రోజు మా మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది.తను కోరుకున్న విధంగానే నేను ఇంకా ఎక్కువగా కష్టపడి మంచి సినిమాలు చేస్తూ నీకు మంచిపేరు తీసుకువస్తాను.ప్రతి ఒక్కరికీ నేను చెప్పేది ఒక్కటే నేను తీసే ఏ సినిమా అయినా టీజర్,ట్రైలర్ లో నా కంటెంట్ నచ్చితేనే సినిమాకు రండి.ఇప్పుడు చేసిన సెబాస్టియన్ కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను.సెబాస్టియన్ తరువాత ఆరు సినిమాలు చేస్తున్న నిర్మాతలు దీప్తి, చెర్రీ,బన్నీ వాసు,అల్లు అరవింద్ గార్లు అందరూ కూడా నన్ను నమ్మారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయను. అడవి శేష్ గారు నటనంటే చాలా ఇష్టం.తనతో పాటు ఆకాష్ పూరి కూడా మా ఈవెంట్ కు వచ్చినందుకు ధన్యవాదాలు.మార్చి 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "సెబాస్టియన్‌ పిసి524’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమా చూశాము అనే ఫీలింగ్ తో బయటికి వస్తారు అన్నారు.

కోమలి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇందులో నా క్యారెక్టర్ రెగ్యులర్ క్యారెక్టర్ లా ఉండదు..ఒక సినిమా చేసినపుడు ఆ సినిమాలో ఎంతసేపు ఉన్నామనేది ఇంపార్టెన్స్ కాదు. ఎంతమంది మనసుల్లో నిలిచిపోయి ఎంత ఇంప్యాక్ట్ ను క్రియేట్ చేశామనేది ముఖ్యం.ఆ ఇంప్యాక్ట్ నీలిమ అనే క్యారెక్టర్ కు వస్తుందని నమ్ముతున్నాను.ఈ క్యారెక్టర్ కొరకు నన్ను సెలెక్ట్ చేసుకున్న దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు.ఫస్ట్ "సెబాస్టియన్" కథ బాలాజీ కల ఇపుడు అది మా అందరి కల,ఇందులో కిరణ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు.త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అన్నారు.

హీరోయిన్ నివేక్ష మాట్లాడుతూ.. బాలాజీ నాకు ఈ కథ చెప్పి నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఈ సినిమా చేశాను.కిరణ్ పోలీస్ ఆఫీసర్ గా చాలా చక్కగా నటించాడు. ఈ నెల 4న వస్తున్న మా చిత్రన్ని అందరూ ఫ్యామిలీస్ తో వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.

నటీనటులు

కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దారేకర్‌), శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, ఆదర్ష్‌ బాలకృష్ణ, జార్జ్‌, సూర్య, మహేష్‌ విట్టా, రవితేజ, రాజ్‌ విక్రమ్‌, లత, ఇషాన్‌, రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

సాంకేతిక నిపుణులు

నిర్మాణ సంస్థ: జ్యోవిత సినిమాస్‌, నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కె.ఎల్‌. మదన్‌, కథ - దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి, సంగీతం: జిబ్రాన్‌, ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి, డిజిటల్‌ పార్ట్‌నర్‌: టికెట్‌ ఫ్యాక్టరీ, మార్కెటింగ్ & బిసినెస్ హెడ్ : చవన్‌ ప్రసాద్‌, స్టిల్స్‌: కుందన్‌ - శివ, సౌండ్‌: సింక్‌ సినిమాస్‌ సచిన్‌ సుధాకరన్‌, కాస్ట్యూమ్స్‌: రెబెకా - అయేషా మరియమ్‌, ఫైట్స్‌: అంజి మాస్టర్‌, సిజి: వీర, డీఐ: రాజు, కూర్పు: విప్లవ్‌ న్యసదాం, కళ: కిరణ్‌ మామిడి, పీఆర్వో: సురేంద్రకుమార్‌ నాయుడు`ఫణి కందుకూరి (బియాండ్‌ మీడియా)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment