BJP: కమలం పార్టీలో సీట్ల లొల్లి.. అధిష్టానం వైఖరిపై ఆగ్రహం..
Send us your feedback to audioarticles@vaarta.com
కూటమిలో భాగంగా కేటాయించిన 6 ఎంపీ సీట్లకు అభ్యర్థులను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అరకు అభ్యర్థిగా కొత్తపల్లి గీత, సీఎం రమేశ్ (అనకాపల్లి), పురందేశ్వరి (రాజమహేంద్రవరం), భూపతిరాజు శ్రీనివాసవర్మ (నరసాపురం), వరప్రసాద రావు (తిరుపతి), రాజంపేట అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలకు టికెట్లు కేటాయించింది. అయితే టికెట్ల కేటాయింపుపై బీజేపీలోని సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖ నుంచి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహారావు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అలాగే రాజమండ్రి నుంచి సోము వీర్రాజు టికెట్ ఆశించగా.. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి కేటాయించారు. ఇక నర్సాపురం, రాజంపేట, తిరుపతి సీట్లలో టికెట్లు ఆశించిన సీనియర్ నేతలు సైతం అధిష్టానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవలే సీట్లలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ సీనియర్లకు అధిష్టానానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయినా కానీ తమకు టికెట్లు ఇవ్వడంపై వార గుర్రుగా ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తొలి నుంచి పార్టీలో ఉన్న తమకు కాకుండా ఇతర పార్టీల నుంచి చేరిన వారికి టికెట్లు ఎలా కేటాయింస్తారంటూ మండిపడుతున్నారు.
తిరుపతి మాజీ ఎంపీ, వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాదరావుకు పార్టీలో చేరిన రోజే టికెట్ కేటాయించడాన్ని తప్పుపడుతున్నారు. తిరుపతి ఎంపీ స్థానాన్ని మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ ఆశించారు. కానీ ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో జీవీఎల్, సోమువీర్రాజు లాంటి సీనియర్ నేతలు బీజేపీ పెద్దలను కలిసి తమకు టికెట్లు ఇవ్వాలని లేదంటే అసెంబ్లీ స్థానాల్లో అయినా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారట. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ సీట్లు కేటాయించిన విషయం విధితమే. దీంతో ఎంపీ టికెట్లు రాని నేతలను అసెంబ్లీ బరిలో దింపనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే బీజేపీ తరపున టికెట్ ఆశించిన నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు మొండిచేయి చూపించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహకారంతో సీఎం జగన్ తనకు నరసాపురం టికెట్ రాకుండా అడ్డుకున్నారని పదే పదే ఆరోపించారు. అయితే తాను నరసాపురం నుంచి పోటీ చేస్తానా లేక వేరే స్థానం చేస్తానా అనేది త్వరలోనే వెల్లడిస్తానన్నారు. కొన్ని పార్టీలకు తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ కుట్రల్ని బలంగా తిప్పి కొడతానని తెలిపారు. అయితే విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ తరపున రఘురామ పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout