లొకేషన్స్ వేటలో బన్నీ.. కొత్త సమస్య!!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుష్ప సినిమా కోసం లొకేషన్ వేటలో పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర ప్రాంతాలను సందర్శించారు. ఆదిలాబాద్ సమీఫంలోని కుంటాల జలపాతంకు వెళ్లిన బన్నీ.. అక్కడి నుండి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యానికి వెళ్లారు. మధ్యలో అభిమానులను పకలరించారు బన్నీ. బన్నీని చూసిన అభిమానులు ఆనందంతో రెచ్చిపోయారు. అందరికీ అభివాదం చేసిన బన్నీ ముందుకు సాగారు. అయితే బన్నీ కుంటాల జలపాతాన్ని తన కుటుంబ సభ్యులతో పాటు పుష్ప చిత్ర యూనిట్‌తో సందర్శించారట. ఇదంతా బాగానే ఉంది. కానీ.. స్థానికులు మాత్రం బన్నీకి అధికారులు చేసిన మర్యాదలపై విమర్శలు వస్తున్నాయి. కోవిడ్ 19 నేపథ్యంలో పర్యాటకులను కుంటాల జలపాతం వద్దకు పంపని అధికారులు బన్నీకి మాత్రం మర్యాదలు ఎందుక చేస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.
బన్నీ, సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య 2 తర్వాత రూపొందుతోన్న చిత్రం పుష్ప. ప్యాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో రూపొందుతో్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్. త్వరలోనే ఈ సినిమా మన తెలుగు రాష్ట్రాల్లోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com