ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి ...

  • IndiaGlitz, [Wednesday,May 06 2020]

గ‌త ఏడాది ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'ఎఫ్ 2'. వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్, త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్ర‌మిది. గ‌త సంక్రాంతి విన్న‌ర్‌గా నిలిచిన ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎఫ్‌3ని తెర‌కెక్కిస్తామ‌ని ద‌ర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్‌రాజు తెలియ‌జేసిన సంగతి తెలిసిందే. అయితే త‌ర్వాత అనిల్ రావిపూడికి సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌ను డైరెక్ట్ చేసే అవ‌కాశం ద‌క్కింది. ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి మ‌హేశ్‌తో చేసిన 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా కూడా విజ‌యం సాధించింది. ఈనేప‌థ్యంలో సీక్వెల్ ఎఫ్ 3 మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది.

సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 స్క్రిప్ట్‌ను పూర్తి చేశాడు. క‌రోనా ప్ర‌భావంతో కావాల్సినంత గ్యాప్ దొర‌క‌డంతో అనీల్ స్క్రిప్ట్‌ను పూర‌త్తి చేసేశాడు. ఇందులో మ‌రో హీరో న‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని అది ఇప్పుడే చెప్పలేన‌ని చెప్పిన అనీల్ రావిపూడి మ‌రో స్టార్ హీరోను ఇందులో న‌టింప చేస్తాడో లేదో చూడాలి. ఎఫ్ 3 లో మ‌హేశ్ న‌టిస్తాడ‌ని, ర‌వితేజ నటిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఒక‌వేళ నిజంగానే మ‌రో స్టార్ న‌టించే అవ‌కాశం ఉంటే ఎవ‌రు న‌టిస్తార‌నే ఆస‌క్తిక‌రంగా మారింది.

More News

కేజీయ‌ఫ్ 2కు భారీ డీల్‌

దక్షిణాది సినిమాల‌కు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన సినిమాల్లో బాహులి ముందు వ‌రుస‌లో ఉంటే ఆ క్రేజ్‌ను మరింత ముందుకు తీసుకెళ్లిన సినిమా కేజీయ‌ఫ్ చాప్ట‌ర్ 1. ఇప్పుడు

ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్ వ‌ద్ద చ‌ర‌ణ్ ట్రైనింగ్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం తార‌క్‌తో క‌లిసి రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం (ఆర్ఆర్ఆర్)’ చిత్రంలో హీరో్యిన్‌గా న‌టిస్తోన్న

తెలుగు నేర్చుకుంటున్న హీరోయిన్‌

ఉత్త‌రాది భామ‌లు ద‌క్షిణాది సినిమాల్లో త‌మ హ‌వా చాటుతున్నారు. ఇప్పుడు ఉత్త‌రాది హీరోయిన్స్ కేవ‌లం అలా వ‌చ్చి సినిమాలు చేసి పోవ‌డ‌మే కాకుండా ఇక్క‌డి వారికి ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కేంద్రం తీరుపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం.. ఏంటిది ఎందుకిలా చేస్తోందో..!?

కేంద్ర ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైల్వే టికెట్లపై నగదు వసూలు చేయడం, కరెంట్ తమ ఆధీనంలోకి తీసుకుంటామనే విషయాలపై కేసీఆర్ ఒకింత సీరియస్ అయ్యారు.

15 తర్వాత తెలంగాణలో ఆర్టీసీ నడుస్తుంది : కేసీఆర్

తెలంగాణలో 15 తర్వాత ఆర్టీసీ నడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆటోలు, క్యాబ్‌లకు గ్రీన్ జోన్లలో మాత్రం పూర్తిగా అవకాశం ఉంటుందన్నారు.