హ్యాట్రిక్ అయితే కొట్టారు కానీ..
Send us your feedback to audioarticles@vaarta.com
అనుపమ పరమేశ్వరన్, మెహరీన్, నివేదా థామస్.. 2016లో తెలుగు తెరకు పరిచయమైన కథానాయికల పేర్లు ఇవి. ఈ ముగ్గురు కూడా గతేడాది తొలి చిత్రంతోనే మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదిలో అయితే సక్సెస్ఫుల్ గా హ్యాట్రిక్ హిట్స్‌ని కంప్లీట్ చేసుకున్నారు కూడా. అఆ, ప్రేమమ్, శతమానం భవతితో అనుపమ మూడు వరుస విజయాలను అందుకుంటే.. కృష్ణగాడి వీర ప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్‌తో మెహరీన్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంది.
ఇక నివేదా థామస్ అయితే.. జెంటిల్మన్, నిన్ను కోరి, జైలవకుశ చిత్రాలతో ఈ ఫీట్‌ని సొంతం చేసుకుంది. అయితే.. ఆ తరువాత ఈ ముగ్గురు భామలు కూడా ఆ సక్సెస్‌ని నిలుపుకోలేకపోయారు. హ్యాట్రిక్ విజయాల తరువాత అనుపమకి ఉన్నది ఒకటే జిందగీతో తొలి ఫ్లాప్ దక్కితే.. కేరాఫ్ సూర్య రూపంలో మెహరీన్‌కి షాక్ తగిలింది. ఇక తాజాగా విడుదలైన జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ రూపంలో నివేదాకి పరాజయం తప్పలేదు. మొత్తానికి హ్యాట్రిక్ తరువాత ఫ్లాప్ దక్కడం.. ఈ ముగ్గురు భామలకి కామన్ పాయింట్‌గా నిలిచినట్లయ్యింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout