హ్యాట్రిక్ అయితే కొట్టారు కానీ..

  • IndiaGlitz, [Wednesday,December 20 2017]

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, మెహ‌రీన్‌, నివేదా థామ‌స్‌.. 2016లో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక‌ల పేర్లు ఇవి. ఈ ముగ్గురు కూడా గ‌తేడాది తొలి చిత్రంతోనే మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాదిలో అయితే స‌క్సెస్‌ఫుల్ గా హ్యాట్రిక్ హిట్స్‌ని కంప్లీట్ చేసుకున్నారు కూడా. అఆ, ప్రేమ‌మ్‌, శ‌త‌మానం భ‌వ‌తితో అనుప‌మ మూడు వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటే.. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ‌, మ‌హానుభావుడు, రాజా ది గ్రేట్‌తో మెహ‌రీన్ హ్యాట్రిక్ సొంతం చేసుకుంది.

ఇక నివేదా థామ‌స్ అయితే.. జెంటిల్‌మ‌న్‌, నిన్ను కోరి, జైల‌వ‌కుశ చిత్రాల‌తో ఈ ఫీట్‌ని సొంతం చేసుకుంది. అయితే.. ఆ త‌రువాత ఈ ముగ్గురు భామ‌లు కూడా ఆ స‌క్సెస్‌ని నిలుపుకోలేక‌పోయారు. హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత అనుప‌మ‌కి ఉన్న‌ది ఒక‌టే జింద‌గీతో తొలి ఫ్లాప్ ద‌క్కితే.. కేరాఫ్ సూర్య రూపంలో మెహ‌రీన్‌కి షాక్ త‌గిలింది. ఇక తాజాగా విడుద‌లైన జూలియ‌ట్ ల‌వర్ ఆఫ్ ఇడియ‌ట్ రూపంలో నివేదాకి ప‌రాజ‌యం త‌ప్ప‌లేదు. మొత్తానికి హ్యాట్రిక్ త‌రువాత ఫ్లాప్ ద‌క్క‌డం.. ఈ ముగ్గురు భామ‌ల‌కి కామ‌న్ పాయింట్‌గా నిలిచిన‌ట్ల‌య్యింది.

More News

'మన్మథుడు' కి 15 ఏళ్లు

అక్కినేని నాగార్జున కెరీర్ లో.. ప్రత్యేకంగా నిలిచిన చిత్రాలలో మన్మథుడు ఒకటి.

నేను పాతిక సినిమాలు చేయడానికి కారణం అభిమానులే - పవర్ స్టార్ పవన్ కల్యాణ్

జల్సా,అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో

సైరాకి రెహ‌మాన్ అంత డిమాండ్ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్వాతంత్ర్య స‌మ‌రయోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా.. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని రామ్ చ‌రణ్ నిర్మిస్తున్నాడు.

విజ‌య్‌, స‌మంత.. ఒకే త‌ర‌హా పాత్ర‌ల్లో..

మ‌హాన‌టి సావిత్రి జీవితంలోని ముఖ్య కోణాల్ని స్పృశిస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హాన‌టి. న‌డిగ‌ర్ తిల‌గ‌మ్ పేరుతో త‌మిళంలోనూ ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

దిల్ రాజు సినిమాల్లో ఈ సారి మిస్సింగ్ అదే

దిల్ రాజు సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే..