సింధియా ఎఫెక్ట్.. డీకేకు కర్ణాటక పగ్గాలు!
Send us your feedback to audioarticles@vaarta.com
కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, పార్టీకి విధేయుడిగా.. కట్టప్పలా కాంగ్రెస్‌కు కాపలా ఉంటున్న డీకే శివకుమార్‌కు అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ఒకట్రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన జ్యోతిరాదిత్య సింధియా ఆ పార్టీకి ఊహించని రీతిలో షాకిచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. సింధియా కమలం కండువా కప్పుకొన్న కాసేపట్లోనే కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలకు పీసీసీ చీప్‌లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక కాంగ్రెస్ బాధ్యతలను కీలక నేత డీకే శివకుమార్‌కు.. ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా అనిల్ చౌదరిని నియమించింది. డీకే శివకుమార్‌ను కర్ణాటక పీసీసీ చీఫ్‌గా నియమించిన కాంగ్రెస్.. ఈశ్వర్ ఖంద్రే, సతీష్ ఝార్కిహోలీ, సలీం అహ్మద్‌లను వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించింది.
కర్మ, కర్మ, క్రియ ఆయనే!
ఆది నుంచి కన్నడ నాట కాంగ్రెస్‌లో డీకే కీలక నేతగా.. ట్రబుల్ షూటర్‌గా ఉన్నారు. మొదట సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొదలుకుని.. ఆ తర్వాత జేడీఎస్-కాంగ్రెస్ చేయి కలిపి మరోసారి సర్కార్‌ను ఏర్పాటు చేయడంలో కర్త, కర్మ, క్రియ అన్నీ డీకేనే. అంతేకాదు.. కర్ణాటకలో సంక్షోభంలో ఉన్నప్పుడు దగ్గరుండి డీకే అన్నీ చూసుకున్నారు. ప్రస్తుతం మనీలాండరింగ్ వివాదం మునిగితేలుతున్నారు. అయితే అప్పట్లో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో పర్యటించి.. సొంత సామాజిక వర్గమైన ‘వక్కళిక’ కమ్యూనిటీ ప్రజలను కలిసి సొంత పార్టీని పెడతారని వార్తలు వినిపించాయి. అయితే ఈ క్రమంలో డీకేను పార్టీలో పెట్టుకుని ఇవాళ కీలక బాధ్యతలు అప్పగించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments