కరోనా గురించి గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ స్తంభించిపోయేలా చేసింది. అయితే కరోనా గురించి పూర్తిగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకూ చిన్నారులకు, వృద్ధులకు కరోనా వస్తే కోలుకోవడం చాలా కష్టమని భావిస్తూ వస్తున్నాం. అయితే చిన్నారులకు కరోనా వచ్చినా పెద్దగా ప్రమాదం లేదని.. భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలోనే ప్రజానీకానికి స్వీడన్ శాస్త్రవేత్తలు ఓ తీపి కబురును అందించారు. కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండితల మందిలో ఉందని తేల్చారు. శరీరంలోని టీ సెల్స్‌ని పరీశిలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. కాగా.. టీ సెల్స్ అనే చిన్నారుల్లో క్రియాశీలకంగా ఉంటాయని దీంతో వారు కరోనా బారినపడినప్పుడు కోలుకునేందుకు చాలా కృషి చేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments