కరోనా గురించి గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు

  • IndiaGlitz, [Thursday,July 02 2020]

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ స్తంభించిపోయేలా చేసింది. అయితే కరోనా గురించి పూర్తిగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పటి వరకూ చిన్నారులకు, వృద్ధులకు కరోనా వస్తే కోలుకోవడం చాలా కష్టమని భావిస్తూ వస్తున్నాం. అయితే చిన్నారులకు కరోనా వచ్చినా పెద్దగా ప్రమాదం లేదని.. భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

ఈ నేపథ్యంలోనే ప్రజానీకానికి స్వీడన్ శాస్త్రవేత్తలు ఓ తీపి కబురును అందించారు. కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి రెండితల మందిలో ఉందని తేల్చారు. శరీరంలోని టీ సెల్స్‌ని పరీశిలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. కాగా.. టీ సెల్స్ అనే చిన్నారుల్లో క్రియాశీలకంగా ఉంటాయని దీంతో వారు కరోనా బారినపడినప్పుడు కోలుకునేందుకు చాలా కృషి చేస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

More News

రష్యాకు 50 వేల కేసుల దూరంలో భారత్

కరోనా మహమ్మారి గత కొద్ది రోజులుగా ఏ స్థాయిలో విస్తరిస్తోందో ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలను చూస్తే అర్థమవుతుంది.

కరోనాతో బాధపడుతూ.. ధైర్యం చెబుతున్న ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్

కరోనా మహమ్మారి కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌లు నిలిచిపోయాయి.

ఈ సమయంలో కూడా ఇలానా..? రివ్యూవర్స్‌పై రఘు కుంచె ఫైర్

కరోనా కారణంగా ఒకరకంగా ప్రపంచమే స్తంభించిపోయింది. దీనిలో భాగంగానే సినీ పరిశ్రమ కూడా మొత్తంగా స్తంభించిపోయింది.

మహేష్‌ను సౌత్ ఇండియాలోనే టాప్‌లో నిలిపిన అభిమానులు

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకి ప్రత్యేక స్థానముంది. ఆయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

చైనాకు షాక్‌ల మీద షాక్‌లిస్తున్న భారత్

భారత్.. చైనాకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. ఒక్కొక్క దానిపై నిషేధం విధిస్తూ కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బుద్ది చెప్పేందుకు సిద్ధమవుతోంది.