కాఫీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త అంటున్న పరిశోధకులు!
Send us your feedback to audioarticles@vaarta.com
పొద్దున లేవగానే చాలా మందికి వేడి వేడి కాఫీ గొంతు దిగనిదే రోజు గడవదు. మరికొందరికైతే ఏ పని చేయాలన్నా కప్పు కాఫీ పడాల్సిందే. ఒక కప్పుతో ఆగితే హ్యాపీ.. మరి కాదంటే ఐదు కప్పులు చాలు.. కానీ అంతకు మించితే మాత్రం హృద్రోగాలు రావడం ఖాయమని వైద్యులు తేల్చి చెబుతున్నారు. ప్రతి రోజు ఐదు కప్పులు మాత్రమే లిమిట్ అని అంతకు మించితే హృద్రోగాల నుంచి తప్పించుకోలేరని వైద్యులు తేల్చి చెబుతున్నారు. దీనిపై యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగా వెల్లడించారు.
ప్రతిరోజూ ఐదు కప్పులకు మించి కాఫీ తాగుతున్న వారిలో.. కాఫీలో ఉండే కఫెస్టోల్ అనే రసాయన మూలకం కారణంగా మనిషిలో కొవ్వు పేరుకుపోతోందని వివరించారు. దీంతో వారిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడంతో హృద్రోగాలు వస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ తాగనిదే ఏ పనిచేయలేకపోతున్నామని గంటకో కప్పు కాఫీ తాగితే ఇబ్బందులు తప్పవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
మరో విషయం ఏంటంటే.. ఫిల్టర్ చేయని కాఫీలో ఈ కఫెస్టోల్ అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కాఫీ ప్రియులు ఫిల్టర్ కాఫీకి ప్రాధాన్యత ఇస్తే కొంతలో కొంత వరకూ మెరుగ్గా ఉంటుందని తెలిపారు. తమ అధ్యయనాన్ని ఇంకా కొనసాగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రోజుకు 300 కోట్ల కప్పుల కాఫీని తాగుతున్నారని అధ్యయనంలో తేలింది. మరోవైపు హృద్రోగాలతో ఏడాదికి 1.79 కోట్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తేలింది. కాబట్టి కాఫీ ప్రియులు తస్మాత్ జాగ్రత్త అని పరిశోధకులు చెబుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout