School Holidays:అలర్ట్: రెండు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు

  • IndiaGlitz, [Tuesday,November 28 2023]

తెలంగాణ ఎన్నికల సందర్భంగా రేపు(నవంబర్‌ 29), ఎల్లుండి(నవంబర్ 30) హైదరాబాద్ నగరంలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. నవంబర్‌ 30 రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్‌ జరగనుండడంతో నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. తిరిగి డిసెంబర్ 1న యదావిధిగా విద్యాసంస్థలు నడవనున్నాయని వెల్లడించారు.

అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో మొత్తం 1.06 లక్షల మంది ఉపాధ్యాయుల్లో 80 శాతం మంది టీచర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. పోలింగ్‌ కేంద్రాలుగా ఉండే విద్యాసంస్థలకు సిబ్బంది ముందు రోజు మధ్యాహ్నం నుంచే చేరుకుంటారు. నవంబర్‌ 29వ తేదీ ఉదయం 7 గంటలలోపే ఈవీఎంలను తీసుకునేందుకు ఉపాధ్యాయులు రిపోర్ట్‌ చేయాలి. దీంతో నవంబర్‌ 29, 30 తేదీల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు సాయంత్రం లోపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు కార్మికులకు, ఉద్యోగులకు ఈనెల 30న వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర కార్మికశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

More News

Kaushik Reddy:ఓడిస్తే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటా: కౌశిక్ రెడ్డి

హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

KCR:97 నియోజకవర్గాల్లో కేసీఆర్ సుడిగాలి పర్యటనలు.. నేటితో ముగింపు

తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Election Campaign:సాయంత్రంతో ముగియనున్న ప్రచారం.. ప్రలోభాలపర్వం మొదలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ సాయంత్ర 5 గంటల తర్వాత మైకులు మోత బంద్ కానుంది.

Mallareddy:'బిజినెస్‌మ్యాన్' సినిమా చూసే ఎంపీనయ్యా: మంత్రి మల్లారెడ్డి

ఇటీవల తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏం మాట్లాడినా తెగ వైరల్ అవుతోంది. మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మల్లన్న..

EC Notices:ఇటు బీఆర్ఎస్‌ పార్టీకి.. అటు కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ నోటీసులు..

బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల సంఘం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే రైతుబంధు నిధుల విడుదల నిలిపివేయాలని ఈసీ ఆదేశించగా..