సజ్జనార్‌కు థ్యాంక్స్ చెప్పిన స్కూల్ ‌పిల్లలు!

  • IndiaGlitz, [Friday,December 06 2019]

దిశపై అత్యాచారం చేసి హత్యచేసిన నలుగురు కామాంధుల పాపం పండింది!. ఇవాళ తెల్లవారుజామున నిందితుల పారిపోతుండగా పోలీసులు వారిని కాల్చిచంపారు. అయితే ఈ ఘటనను యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకు దీన్ని సమర్థిస్తున్నారు. మరోవైపు తమదైన శైలిలో మీడియా, సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. అయితే నిందితులు పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా.. సీపీ సజ్జనార్‌ను సంప్రదించిన పోలీసులు.. ఆయన కీలక ఆదేశాలతో ఎన్‌కౌంటర్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అంతేకాదు ఆయనపై పూలవర్షం కురిపిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు.

చాలా మంచి పని చేశారు సార్!

అయితే ఈ ఘటన జరిగిన అనంతరం ఆ ప్రాంతానికి సజ్జనార్ చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులు అసలేం జరిగింది..? అనే విషయాన్ని నిశితంగా వివరించారు. ఇదిలా ఉంటే.. స్కూల్‌ బస్సులో వెళ్తున్న విద్యార్థులు సజ్జనార్‌కు చేయిచ్చి.. థ్యాంక్స్ చెప్పారు. ‘చాలా మంచి పని చేశారు సార్’ అని ఆయనకు పలువురు విద్యార్థులు గులాబీలు ఇచ్చారు. ఈ క్రమంలో సజ్జనార్ జిందాబాద్.. జైజై సజ్జనార్ అంటూ అక్కడున్న జనాలు నినాదాలతో హోరెత్తించారు. మరోవైపు అటుగా వాహనాల్లో వెళ్తున్న జనాలు సజ్జనార్‌కు దండం పెట్టారు.

More News

బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను హ్యాట్రిక్ మూవీ ప్రారంభం

`సింహ, లెజెండ్` లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో

శ్రీవిష్ణు హీరోగా 'ఎల్.ఎల్.పి' చిత్రం ప్రారంభం

యువ కథానాయకుడు శ్రీవిష్ణు  హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థలు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎల్.ఎల్.పి.

ఎన్‌కౌంటర్‌తో సత్వర న్యాయం లభించింది: పవన్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటనలోని నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ బాధితురాలి తల్లిదండ్రులు..

శభాష్ పోలీస్ అంటూ పూల వర్షం

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’కు పాల్పడిన నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ ప్రముఖుల రియాక్షన్ ఇదీ..

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘దిశ ఘటన’లో నిందితులను శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.