Rajya Sabha:రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. పోలింగ్ తేదీ ఇదే..

  • IndiaGlitz, [Monday,January 29 2024]

లోక్‌సభ ఎన్నికల కంటే ముందు మరో కీలకమైన ఎన్నికలకు రంగం సిద్ధమైంది. త్వరలో 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 మంది రాజ్యసభ సభ్యుల ఎంపికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.

అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10 మంది.. బిహార్, మహారాష్ట్రలో ఆరుగురు సభ్యులకు ఎన్నిక జరగనుంది. ఇక పశ్చిమబెంగాల్‌లో ఐదుగురు, మధ్యప్రదేశ్‌లో ఐదుగురు, కర్ణాటకలో నలుగురు సభ్యులు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలు ఉండగా.. ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో స్థానానికి ఈ ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ ఇదే..

ఫిబ్రవరి 8- ఎన్నికల నోటిఫికేషన్
ఫిబ్రవరి 15- నామినేషన్లకు చివరి తేదీ
ఫిబ్రవరి 16- నామినేషన్ల పరిశీలన
ఫిబ్రవరి 20- నామినేషన్ల ఉపసంహరణకి చివరి తేదీ
ఫిబ్రవరి 27- పోలింగ్

కాగా ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలే టార్గెట్‌గా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు. ఈ మూడు స్థానాల్లో ఒకటి వైసీపీ సిట్టింగ్ కాగా.. మిగిలిన రెండు టీడీపీ స్థానాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకునేందుకు వైసీపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వైసీపీకి ఉన్న సంఖ్యాబలం పరంగా మూడు స్థానాలూ వైసీపీకే దక్కే అవకాశం ఉంది. దీంతో వైసీపీ అభ్యర్థులుగా వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాస్‌లను ఖరారుచేసింది.

అయితే ప్రస్తుతం చేస్తున్న మార్పులు చేర్పుల కారణంగా అసంతృప్త ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేల బలాన్ని తగ్గించేందుకు వ్యూహాలు సిద్ధం చేసింది. వైసీపీ నుంచి టీడీపీకి మారిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణరెడ్డి.. టీడీపీ నుంచి వైసీపీకి మారిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరి, జనసేన నుంచి వైసీపీకి వెళ్లిన రాపాక వరప్రసాద్‌లకు ఇప్పటికే స్పీకర్ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు పంపారు. ఈ క్రమంలోనే విశాఖ ఉత్తర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు.

ఇదిలా ఉంటే స్పీకర్ నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు హైకోర్టులో పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. ఇక తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాసరావు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి నోటీసులు జారీ చేసింది. అనంతరం త‌దుప‌రి విచార‌ణ‌న‌ను మూడు వారాల‌కు వాయిదా వేసింది.

More News

Animal:ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన 'యానిమల్'.. ఉత్తమ నటుడు ఎవరంటే..?

హిందీ చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఫిల్మ్‌ఫేర్‌’ (Film Fare awards) అవార్డుల్లో 'యానిమల్' చిత్రం సత్తా చాటింది.

Rashmika:సౌందర్య బయోపిక్‌లో నటించాలని ఉంది.. రష్మిక వ్యాఖ్యలు వైరల్..

రష్మిక మందన్న.. నేషనల్ క్రష్‌గా ఫుల్ పాపులారింటీ దక్కించుకున్నారు. 'పుష్ప' సినిమాతో బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా స్థిరపడ్డారు.

Chandrababu: ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట

టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న ప్రభుత్వం పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

Venkatesh, Rana: వెంకటేశ్, రానాలకు షాక్.. పోలీస్ కేసుకు కోర్టు ఆదేశం

స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌(Venkatesh)ఆయన సోదరుడు దగ్గుబాటి సురేశ్‌ బాబుకు నాంపల్లి కోర్టులో గట్టి షాక్ తగిలింది. ఇద్దరితో పాటు రానా(Rana), అభిరామ్‌లపై పోలీసు కేసు నమోదు చేయాలని

Sharmila:షర్మిలతో వివేకా కూతురు సునీత భేటీ.. కాంగ్రెస్‌లో చేరే అవకాశం..!

ఏపీ రాజకీయాల్లో రోజుకొక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలకే పరిమితమైన షర్మిల..