తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల
- IndiaGlitz, [Thursday,February 11 2021]
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక ముగిసిందో లేదో మరో ఎన్నికల కోసం షెడ్యూల్ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు గ్రాడ్యుయేట్స్ కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.
మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్- ఖమ్మం-నల్లగొండ రెండు స్థానాలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఫిబ్రవరి 23 వ తేదీ నామినేషన్లకు చివరి తేదీ. ఫిబ్రవరి 24 వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఫిబ్రవరి 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. మార్చి 14న పోలింగ్ జరగనుంది.14న ఉదయం 8.00గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో తక్షణమే ఎన్నిక కోడ్ అమలులోకి వచ్చినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. అలాగే ఏపీలో కూడా ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది.