కుప్పంలో సీన్ రివర్స్.. చంద్రబాబు దిద్దుబాటు చర్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఇంటి గెలిచి.. రచ్చ గెలవాలి’ అంటారు పెద్దలు. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యింది. ఏపీలో తాజాగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన ఫలితాలైతే క్లారిటీ లేవు. ఏ పార్టీ కాపార్టీ మాకు అంత శాతం ఓట్లు వచ్చాయంటే మాకు ఇంత శాతం ఓట్లు వచ్చాయంటూ డబ్బాలు కొట్టుకోవడం తప్ప అధికారిక ప్రకటనలైతే లేవు. ఇదిలా ఉండగా కుప్పంలో మాత్రం టీడీపీ సతికలపడింది. దీనిదేముంది అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకే అనుకూలంగా స్థానిక ఎన్నికల ఫలితాలు వస్తుంటాయి అని సరిపెట్టుకుందామంటే ఆ నియోజకవర్గమేమీ సాధారణ వ్యక్తిది కాదు.. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోకవర్గం.
అవును.. చంద్రబాబు సొంత నియోజకర్గంలో టీడీపీకి వచ్చిన ఫలితాలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లోనే మొదటి రెండు రౌండ్లు వైసీపీకి అనుకూలంగా రావడం గమనార్హం. ఆ తర్వాతి నుంచే టీడీపీ పుంజుకుంది. మరి అలాంటప్పుడు తరువాత ఏ ఎన్నికలైనా జరిగితే ఎంత జాగ్రత్తగా ఉండాలి? కానీ స్థానిక సంస్థల ఎన్నికలను సైతం చంద్రబాబు గాలికి వదిలేశారేమో అనిపిస్తుంది కుప్పం ఫలితాలను చూస్తే. కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా.. 74 చోట్ల వైఎస్సార్‌సీపీ అభిమానులు విజయం సాధించడం గమనార్హం. టీడీపీ మద్దతుదారులు 14 పంచాయతీల్లో, ఇతరులు ఒక పంచాయతీలో గెలుపొందారు. ఇంతటి దారుణమైన ఫలితాలు కుప్పంలో టీడీపీకి రావడం చంద్రబాబుకు ఒక రకంగా ఘోర అవమానమే.
దీంతో ఆయన దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. అధికారులే ఫలితాలను తారుమారు చేశారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈ మేరకు తాజాగా ఆయన కుప్పం నియోజకవర్గ ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘ఎవ్వరూ అధైర్యపడొద్దు. త్వరలోనే నేనొస్తా.రెండుమూడు రోజులుండి పరిస్థితులను సమీక్షిస్తా. మైండ్ గేమ్ ఆడారు. ఉయ్ విల్ ఫేస్ ఇట్’అంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేశారు. సంఘటితంగా ఉండాలని, మన బలహీనతలు, అనైక్యతలను అవతలివారు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారని చెప్పారు. ఈ ఫలితాలు విలువలకు ప్రాధాన్యమిచ్చే కుప్పం వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మబ్బులు తొలగిపోతాయని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీకి వడ్డీ తీర్చుకుంటామని కుప్పం శ్రేణులకు చంద్రబాబు వెన్ను తట్టి ధైర్యం చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout