ప్రియాంక, నిక్ పెళ్లి పై తప్పుడు కథనం
Send us your feedback to audioarticles@vaarta.com
ఈ నెల 2,3 తేదీల్లో అమెరికన్ సింగర్ నిక్‌జోనస్‌ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి వైభవంగా జరిగింది. అంతా హ్యాపీ అని అనుకుంటున్న తరుణంలో న్యూయార్క్‌కు చెందిన కట్ అనే మ్యాగిజైన్ వీరి పెళ్లికి సంబంధించి రాసిన కథనం పెను దుమారాన్ని రేపింది.
సదరు మ్యాగజైన్ వెబ్సైట్లో నిక్, ప్రియాంకల వివాహం బలవంతపు వివాహం అని ప్రచురించడం హాట్ టాపిక్ అయ్యింది. నిక్.. ప్రియాంకతో ఎంజాయ్ చేయాలనుకున్నాడని.. అయితే ప్రియాంక మాత్రం నిక్‌ను బలవంతంగా పెళ్లి పీటల వరకు నడిపించిందని కథనం రాసింది.
ఈ కథనం పై ప్రియాంక ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వివాహంతో హ్యాపీగా ఉన్న తనను అలాంటి వార్తలు ఇబ్బంది పెట్టలేవని తెలియజేసింది. ఈ కథనాన్ని జాతి వివక్షతో రాశారని పలువురు ప్రముఖులు విమర్శించడంతో సదరు మాగజైన్ కథనాన్ని వెబ్సైట్ నుండి తొలగించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com