నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురు
Send us your feedback to audioarticles@vaarta.com
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోమారు చుక్కెదురైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ను పునర్నియమించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నేడు ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రమేష్ కుమార్ కేసులో ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
హైకోర్టు ఆదేశాల కారణంగా అధికారులు విధులు నిర్వర్తించలేకపోతున్నారని.. మధ్యంతరంగా రాష్ట్ర ఎన్నికల కమిషర్‌ను నియమించేలా గవర్నర్‌కు ఆదేశాలివ్వాలని ప్రభుత్వ తరుఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. కాగా గవర్నర్‌కు ఇప్పుడు సూచనలు చేయలేమని.. ఎన్నికల నిర్వహణపై మాట్లాడదలుచుకోవడం లేదని.. తుది వాదనలను మూడు వారాల్లో వింటామని సీజేఐ జస్టిస్ బొంబ్డే స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout