చీఫ్ జస్టిస్ గొగోయ్‌కు సుప్రీంకోర్టు క్లీన్చిట్
- IndiaGlitz, [Monday,May 06 2019]
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సోమవారం నాడు విచారణ జరిపిన అంతర్గత త్రిసభ్య కమిటీ ఆయనకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని తేల్చింది. ఫిర్యాదులోని ఆరోపణలను బలపరిచే ఆధారాలేవీ లభించలేదని స్పష్టం చేసింది. దీంతో గొగోయ్‌పై వేధింపుల కేసు కొట్టివేసిన సుప్రీం క్లీన్చిట్ ఇవ్వడం జరిగింది.
గత కొన్నిరోజులుగా ఈ వ్యవహారంసై నిశితంగా వివరాలు సేకరించి, విచారించిన త్రిసభ్య కమిటిలోని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రా సభ్యులు.. సోమవారం సాయంత్రానికి ఈ ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేశారు. ఈ విషయాన్ని కమిటీ నివేదిక ఏం తేల్చిందన్నది సీజేఐ సెక్రటరీ జనరల్ ప్రకటన రూపంలో వెల్లడించారు.
గతంలో సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఓ మహిళ.. తనపై గొగోయ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. కాగా ఈ ఆరోపణలు వచ్చినప్పుడే తానే తప్పు చేయలేదని.. ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదని గొగోయ్ మీడియా ముందు వాపోయారు. అంతేకాదు త్రిసభ్య కమిటిలో సభ్యుడిగా ఉన్న ఎన్వీ రమణ సైతం ఈ వ్యవహారాలన్నీ నచ్చక బయటికొచ్చేశారు. సో,, చివరికి అందరూ అనుకున్నట్లుగానే రంజన్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది.