ఎస్సీ-ఎస్టీలకు రాజకీయ అధికారం దక్కలేదు!

  • IndiaGlitz, [Friday,April 05 2019]

తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో పొరాడి తెచ్చుకుంటే... అవేవీ ఆచరణలో నెరవేరలేదు అని బీఎస్పీ అధినేత్రి మాయావతి చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఆ ఆకాంక్షలు నెరవేర్చలేకపోయింది అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహుజనసేన యుద్దభేరి బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. పెద్దగా ఎలాంటి అభివృద్ధి లేదు. తెలంగాణలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నా వారికి రాజకీయ అధికారం దక్కలేదనీ, 2 శాతం ఉన్న వర్గమే రాజ్య మేలుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి అన్యాయం జరిగిందో ప్రస్తుత తెలంగాణకు ఇక్కడి పాలకులు అలాంటి అన్యాయమే చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలు అన్నింటా నిరాదరణకు గురవుతున్నారు. డా.అంబేడ్కర్ కలలు నెరవేరలేదు. ఆ మహనీయుడు ఆశించిన రిజర్వేషన్ ఫలాలు పూర్తిగా అందకపోవడానికి పాలకుల తీరే కారణం. దళితులకు రాజ్యాధికారం వచ్చినప్పుడే ఆ ఫలాలు అందుతాయి అని మాయావతి చెప్పుకొచ్చారు.

అచ్చే దిన్ ఏవీ..

భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే అచ్చే దిన్ అన్నారు.. కానీ అణగారిన వర్గాల ప్రజలు, ముస్లింలకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. అచ్చే దిన్ ఎక్కడో బీజేపీవాళ్ళు చెప్పగలరా? ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ హయాంలో పేదలు అలాగే ఉండిపోయారు. ఇప్పుడు పేదలకు ఖాతాల్లోకి రూ.72వేలు వేస్తాం అని అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడులు ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పవన్ ముఖ్యమంత్రి అవుతారని విశ్వసిస్తున్నాను. ఆ పదవికి ఆయన అన్ని విధాలా యోగ్యుడు. తెలంగాణలోనూ బీఎస్పీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయిఅన్నారు.

More News

లక్ష్మీపార్వతిపై లైంగిక వేధింపుల ఫిర్యాదు...

దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల అన్నగారు ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని

జనసేన గురించి రాములమ్మ ఎందుకిలా అన్నారో..!

మెగా ఫ్యామిలీ అంటే సీనియర్ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మకు ఎనలేని గౌరవం, ఇష్టం.

జనసేనకు ప్రచారం చేయనున్న ఇద్దరు మెగా హీరోలు!

ఏపీలో ఎన్నికలకు కొద్దిరోజులు సమయం ఉండటంతో అటు అధికార పార్టీ.. ఇటు ప్రతిపక్ష పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

జనసేన మేనిఫెస్టోపై చెర్రీ ఆసక్తికర ట్వీట్...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల కంటే ముందుగా జనసేన మేనిఫెస్టో ప్రకటించిన విషయం విదితమే.

వైఎస్ జగన్ స్థానంలో నేనుంటే.. పవన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థానంలో తానుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.