గుడ్ న్యూస్ చెప్పిన ఎస్బీఐ..
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్‌ను అందించింది. గృహ కొనుగోలు దారులకు సంక్రాంతికి ముందే పండుగ కానుకను అందించింది. గృహ రుణాల వడ్డీ రేటుపై 30 బేసిన్ పాయింట్ల మేర రాయితీని ఇవ్వడమే కాకుండా.. 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును మినహాయించింది. అయితే ఇదంతా సిబిల్ స్కోర్ ఆధారంగా మాత్రమే వర్తిస్తుంది. కాగా.. రూ.30 లక్షల వరకూ గృహ రుణాలపై ప్రారంభ వడ్డీ రేటును 6.80 శాతానికి.. అంతకు మించి ఉన్న రుణాలపై 6.95 శాతంగా నిర్ధారించినట్టు ఎస్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక మహిళా కొనుగోలుదారులైతే 5 బేసిన్ పాయింట్ల రాయితీ ఇవ్వనున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. రూ. 5 కోట్ల వరకు రుణాలపై 30 బేసిస్ పాయింట్ల రాయితీ దేశంలోని ఎనిమిది మెట్రో నగరాల్లో అందుబాటులో ఉంటుందని భారతీయ స్టేట్ బ్యాంకు తెలిపింది. రాయితీలను మెరుగుపరిచినందుకు ఎస్బీఐ సంతోషం వ్యక్తం చేసింది. వడ్డీ రుణాలపై పెద్ద మొత్తంలో రాయితీలు ప్రకటించడంతో ఇళ్ల కొనుగోలుకు మరింత మంది ఆసక్తి చూపిస్తారని ఎస్బీఐ ఎండీ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ శెట్టి తెలిపారు. ఎస్బీఐ ఇచ్చిన రాయితీతో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే వారికి మంచి అవకాశం కలిగినట్టైంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com