గృహ రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్
Send us your feedback to audioarticles@vaarta.com
గృహ రుణం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ న్యూస్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణం తీసుకోవాలనుకునేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గృహ రుణంపై వడ్డీ రేట్లను ఏకంగా 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ఎస్బీఐ తాజాగా వెల్లడించింది. కనీస వడ్డీ రేటు 6.70 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. అయితే ఇదంతా సిబిల్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీ రేట్లు ఖరారు అవుతాయని ఎస్బీఐ వెల్లడించింది. అంతేకాకుండా.. ఫ్రాసెసింగ్ ఫీజు రద్దు కూడా కొనసాగుతుందని తెలిపింది. అయితే.. ఈ ఆఫర్ కేవలం మార్చి 31 వరకూ మాత్రమే అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
కస్టమర్ల సిబిల్ స్కోర్, తీసుకోబోతున్న రుణం మొత్తం ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయిస్తామని ఎస్బీఐ వెల్లడించింది. సమాయానికి చెల్లింపులు చేసే కస్టమర్లకు తక్కువ వడ్డీకే రుణాలు అందాలనేదే తమ లక్ష్యమని తెలిపింది. ప్రస్తుతం ఎస్బీఐ 75 లక్షల లోపు రుణాలను 6.7 కనీస వడ్డీ రేటుతో అందిస్తోంది. రూ. 75 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ మించిన లోన్స్‌కు కనీస వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. ప్రాసెసింగ్ ఫీజుపై సైతం రాయితీ అందించనున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది.
అయితే.. యోనో యాప్ ద్వారా గృహ రుణాలు పొందేవారికి మరో ఐదు బేసిస్ పాయింట్ల మేరు వడ్డీ రేటు తగ్గుతుందని కూడా పేర్కొంది. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రుణ గ్రహీతలకు అదనంగా మరో 5 బేసిస్ పాయింట్ల రాయితీని అందిస్తున్నట్టు ఎస్బీఐ వెల్లడించింది. తాము పారదర్శకతను పాటిస్తాం కాబట్టి వినియోగదారులు తమను పూర్తిస్థాయిలో విశ్వసిస్తారన్నారు. మార్కెట్లో ఇంత కంటే తక్కువ వడ్డీరేటు లేదని ఎస్బీఐ రిటైల్ బిజినెస్ మ్యానేజింగ్ డైరెక్టర్ వ్యాఖ్యానించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments