ఎస్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీలో ‘కోత’
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుత్వం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. మే-01 నుంచి కొత్త వడ్డీ రేట్ల విధానం అమల్లోకి తెచ్చింది. కాగా అధిక డిపాజిట్ కలిగిన పొదుపు ఖాతాలు, స్వల్పకాలిక రుణాల వడ్డీ రేట్లను ఆర్బీఐ రెపో రేటుతో అనుసంధానించనున్నట్లు మార్చిలో ఎస్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్బీఐ పరపతి సడలింపు ప్రయోజనాలను సత్వరమే కస్టమర్లకు చేరవేసేందుకు వడ్డీ రేట్లను రెపోతో లింక్ చేయాలని నిర్ణయించింది. కాగా.. ఈ అనుసంధానం బుధవారం (మే-01) నుంచి అమల్లోకి వచ్చింది. గత రెండు సమీక్షల్లో ఆర్బీఐ రెపో రేటును వరుసగా పావు శాతం చొప్పున తగ్గించింది. దాంతో ప్రస్తుత రెపోరేటు 6 శాతంగా ఉంది.
తగ్గింపు...
ఇప్పటివరకూ ఈ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నా.. కస్టమర్‌కు వడ్డీ 3.5 శాతం అందేది. అయితే ఇకపై ఖాతాలో రూ.లక్ష దాటి ఉంటే వడ్డీరేటును ఎస్బీఐ తాజాగా పావుశాతం తగ్గించింది. దీనితో ఈ తరహా కస్టమర్లకు 3.25 శాతం వడ్డీయే అందుతుంది. 2018 డిసెంబర్ నాటికి ఎస్బీఐ దేశీయ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల విలువ దాదాపు రూ.10.64 లక్షల కోట్లు అన్న సంగతి తెలిసిందే. కాగా ఇది ఎస్బీఐ ఖాతాదారులకు ఒకింత షాకింగ్ వార్తే అని చెప్పుకోవచ్చు.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout